విశాఖపట్టణం, నవంబర్ 12,
ఎంత పెద్ద ట్రబుల్ షూటర్ కి అయినా.. ట్రబుల్ తప్పదు. అలాగే.. వైసీపీలో ఎంపీ విజయసాయి రెడ్డికి కూడా మెల్ల మెల్లగా ప్రాధాన్యత తగ్గుతూ వస్తుందంట. అధిష్టానం కూడా చూసీ చూడనట్లు వదిలేస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఒక్కరి కోసం ఎంతమందిని వదులుకోవాలి.. ఎంతమందికి చిరాకు తెప్పించాలనే థాట్ లో ఉందంట అధిష్టానం. వైసీపీ అంటే విజయసాయి.. విజయసాయి అంటే వైసీపీ అన్నట్లుగా ఉండేది ఎవ్వారం. జగన్ మీద ఈగ వాలకుండా చూడాలన్నా.. ఎవరికి ఎలాంటి కౌంటర్ ఇవ్వాలన్నా.. విజయసాయి రెడీగా ఉంటారు. అలా అందరు లీడర్లనీ డామినేట్ చేస్తూ.. వైసీపీ అంటే తనదే అనేలా చేస్తున్నారని.. లీడర్లని కూడా స్కూల్ లో టీచర్ లా ట్రీట్ చేస్తున్నారని చాలా మందికి అసహనం ఉందంట. ఇప్పుడిప్పుడే అది బయట పడుతుంది అనే టాక్ వినిపిస్తోంది.విజయసాయి రాజ్యసభ సభ్యుడు. ఎన్నిక కాలేదు. కానీ.. పార్టీలో డీఆర్సీ మీటింగ్ లో తన మాటే వేదం. ఒక రాజ్యసభ సభ్యుడికి మించిన పవర్ ఉంది. పార్టీలో ప్రభుత్వంలో కీలకంగా ఉంటారు. చట్టపరంగా కూడా అన్నీ తెలిసిన లీడర్ కావడంతో.. అధిష్టానం నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. కానీ.. దీన్ని మిస్ యూజ్ చేసుకుంటున్నారు.. అందరినీ పురుగుల్లా చూస్తున్నారు అని చాలామంది ఇన్ సైడ్ డిస్కషన్ లు చేస్తుంటారట. రీసెంట్ గా విశాఖ డీఆర్సీ మీటింగ్ లో ఇది బయటపడిందంట.వైసీపీ లీడర్లు అవినీతికి పాల్పడుతున్నారు.. కాస్త తగ్గించుకుంటే మంచిది అనేలా వార్నింగ్ ఇచ్చారట. దీనికి లీడర్లు కూడా బానే సీరియస్ అయ్యారట. అందరినీ కలిపి వార్నింగ్ ఇవ్వడం కాదు.. ఎవరు తప్పు చేస్తున్నారో చెప్పి.. చర్యలు తీసుకోండి.. కలిపి అనకండి అని లీడర్లు గట్టిగానే మాట్లాడారట. అలా మాట్లాడిన వారిలో.. వైసీపీలోని ఓ పవర్ ఫుల్ లీడర్ కూడా ఉన్నారట. ఇంకా చాలా రచ్చ జరిగిందని.. ఆయన ముందు కాస్త కామ్ గానే ఉన్నా.. తర్వాత కన్వర్జేషన్ లు కొంచెం ఘాటుగానే ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది.లీడర్లైతే గుంపుగా వెళ్లి.. సీఎం జగన్ ముందు ఇష్యూ ని ఉంచాలని ప్లాన్ చేస్తున్నారట. కాస్త తమని కూడా లీడర్లలా చూడాలని.. తాము కూడా వైసీపీ లీడర్లమనే విషయాన్ని గుర్తుంచుకుని మాట్లాడితే మంచిది అని చెప్పాలని చూస్తున్నారట. ఏదెలా ఉన్నా.. విజయసాయి రెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది అనే మాట మాత్రం బానే వినిపిస్తోంది.