గుంటూరు, నవంబర్ 12,
పబ్లిసిటీ అంటే సినిమా వాళ్లకే కాదు. పొలిటికల్ లీడర్లకి కూడా ఇంపార్టెంటే. గట్టిగా మాట్లాడితే పొలిటికల్ లీడర్లకి ఇంకా ఇంపార్టెంట్. అందుకే.. ఇప్పుడు పొలిటికల్ లీడర్లు కూడా పబ్లిసిటీపై మరికాస్త ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. వారిలో ముఖ్యంగా కనిపించేవారు వైసీపీ లీడర్ విడదల రజనీ. ఏ ఛాన్స్ నీ మిస్ చేసుకోరు. ఎవరినీ దూరం చేసుకోరు. బుగ్గగిల్లిన బుడ్డోడ్ని కూడా ఏమీ అనరు. సరదాగా తీసుకుంటారు. ఏమో.. ముందు ముందు రోజుల్లో ఆ ఏరియాకి విడదల రజనీ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాడే కావచ్చునేమో.అసలు అప్పటి నుంచే విడదల రజనీకి ఇంకాస్త ఫేమ్ వచ్చింది. పిల్లాడు చేసిన చిలిపి పనికి ఆమె ఇచ్చిన రియాక్షన్ కి అందరూ ఇంప్రెస్ అయ్యారు. ఎమ్మెల్యే అయినా ఏ మాత్రం పొగరు చూపించలేదు అని ఓన్ చేసుకున్నారు. ఇక ఏ ఛాన్స్ దొరికినా జనంలోకి తుర్రున వెళ్లాలంటే విడదల రజనీ తర్వాతనే వైసీపీలో ఎవరైనా. తియ్యండ్రా బండ్లు అనడం.. బయల్దేరడం. పక్కన పెట్టండ్రా బండ్లు అనడం.. పాదయాత్ర చేయడం. ఇదీ విడదల రజనీ స్టైల్. జగన్ ఏం చేసినా.. జనంలోకి వెళ్లేది మాత్రం విడదల రజనీనే. అసలు జగన్ కంటే ముందుగానే వెళ్తారీవిడ అనేవాళ్లూ ఉన్నారు.ఇప్పుడు విడదల రజనీకి.. ఇంకో ఎమ్మెల్యే తోడయ్యారు. ఆమె కూడా అంతే. అమెపేరే.. శ్రీదేవి. ఉండవల్లి శ్రీదేవి కూడా అంతే. ఏ పథకం స్టార్ట్ చేసినా చలో అంటారు. ఈమె కూడా అంతే. ఇద్దరిదీ గుంటూరే.. పక్క పక్కనే ఉండడం.. ఒకే స్టైల్ లో మూవ్ అవుతున్నారు. ఇద్దరూ లేడీ ఎమ్మెల్యేలు కావడం.. జనంలో మంచి రెస్పెక్ట్ ఉండడంతో.. దూసుకెళ్తున్నారు. ఒకరికి ఒకరు తోడు అన్నట్లు.. వాళ్లేం చేస్తున్నారు.. వీళ్లేం చేస్తున్నారు అంటూ మూవ్ అవుతున్నారు. ఇప్పుడు మొన్న యాత్ర.. ఇవాళ వైఎస్సార్ జలకళతో జనంలోకి వెళ్లారు. రేపు ఇంకొకటి..ఎళ్లుండి ఇంకొకటి.. అవతల ఎళ్లుండి మరొకటి అంతే. జనంలోకి వెళ్లాల్సిందే.. మంత్రి పదవి కొట్టాల్సిందే. ఇద్దరి జిల్లాలు ఒకటే కావడమే కాదు.. ఇద్దరి టార్గెట్ లు కూడా ఒకటే.