హైద్రాబాద్, నవంబర్ 12,
కొరటాల మెగా కాంపౌండ్ లోకి అడుగు పెట్టి రెండేళ్లు దాటింది. ఇక చిరు తో ఆచార్య మొదలు పెట్టి ఏడాది గడిచిపోయినా.. కొరటాల కష్టాలు తీరడం లేదు. కొరటాల – చిరు కాంబోలో తెరకెక్కుతున్న ఆచార్య షూటింగ్ ఇంకా కొలిక్కి రాలేదు. కరోనా తో వాయిదా పడిన ఆచార్య షూటింగ్ తిరిగి సోమవారం మొదలయ్యింది. అయితే ఆచార్య సెట్స్ లో అడుగుపెట్టకముందే చిరు కరోనా బారిన పడడంతో ఆచార్య షూటింగ్ ఆగిపోయిందనే అనుకున్నారు. మరి మెయిన్ హీరో చిరు కి బాగోకపోతే టీం మాత్రం షూటింగ్ ఏం చేస్తుందిలే అనుకున్నారు. కానీ చిరు కి కరోనా ఉన్నప్పటికీ… ఎలాంటి లక్షణాలు లేకపోయినా హోమ్ క్వారంటైన్ లో ఉంటే.. కొరటాలకి చాలా కష్టము. అయినప్పటికీ.. కొరటాల నిరుత్సాహపడకుండా మేకర్స్ ని కలిసి ప్లాన్ చేసి ఆచార్య షూటింగ్ ని యధావిధిగా కానిచ్చేస్తున్నాడట.అంటే ముందుగా చిరు లేని సన్నివేశాలను తెరకెక్కిస్తూ టీం మొత్తం హడావిడిగా ఉందట. మరి చిరు తో సెట్స్ లో అడుగుపెట్టాలని కొరటాల పక్కా ప్లాన్ చేసుకుంటే చిరు కి కరోనా రావడంతో షాకయిన కొరటాల ముందు కాస్త కంగారు పడినా తేరుకుని.. ప్రొడక్షన్ టీం తో చర్చించి.. చిరు లేని కొన్ని సన్నివేశాలు తెరక్కించాలని ప్లాన్ చేసుకుని కొరటాల రంగంలోకి దిగేశాడట. చిరు కి కరోనా తీవ్రత పెద్దగా లేకపోవడంతో రెండు వరాల హోమ్ క్వారంటైన్ తర్వాత చిరు ఆచార్య సెట్స్ లో జాయిన్ అవుతాడని కొరటాల నమ్మకమట. అందుకే ఆచార్య షూటింగ్ ఆగకుండా ప్లాన్ చేసుకున్నాడని తెలుస్తుంది. మరి చిరు వలన ఆచార్య షూటింగ్ పోస్ట్ పోన్ అయితే.. ఆచార్య రాక మరింత ఆలస్యం అవుతుందని అనుకున్నారు మెగా ఫాన్స్. కానీ ఇప్పుడా దిగులు లేదంటున్నారు.