శ్రీకాళహస్తి నవంబర్ 12,
బీజేపీ కార్యకర్తల జోలికి వస్తే సహిం చేది లేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోలా ఆనంద్పై స్థానిక ఎమ్మెల్యే మధు తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని... ఇలా చేస్తే తగిన మూల్యం చెల్లించు కోవాల్సి వస్తుందన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో బీజేపీ కార్యకర్తల కోసం ప్రత్యేక శిక్షణా తరగతులను ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు.జగన్ నవరత్నాల పేరుతో పేదలను మభ్య పెడుతు న్నారని విమర్శించారు. రాష్ట్రంలో సంపదనిచ్చే గనులన్నీ రాజకీయ నేతల చేతుల్లో ఉన్నాయనీ... బీజేపీ అధికారంలోకి వస్తే ఈ గనులను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు స్వాధీనం చేస్తామన్నా రు. జీవిత బీమా సంస్థలో డెవలప్మెం టు అధికారిగా పనిచేస్తున్న చంద్రప్ప తన ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. సోము వీర్రాజు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు ఏపీ సీడ్స్ కూడలి వద్ద బీజేపీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పట్టణ వీఽఽధుల్లో ర్యాలీ నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి, మాజీ మంత్రి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షు డు రావెల కిషోర్బాబు, అధికార ప్రతినిధి భానుప్రకాశ్రెడ్డి, మీడియా ప్రతినిధి కోలా ఆనంద్, రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమ, జిల్లా అధ్యక్షుడు దయాకర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కాసరం రమేష్, సురేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.