YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జనవరి తర్వాత గ్రేటర్ ఎన్నికలు

జనవరి తర్వాత గ్రేటర్ ఎన్నికలు

హైద్రాబాద్, నవంబర్ 12
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు సమయం ఉన్నప్పటికీ, ముందుగానే గ్రేటర్ కు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలిస్తోంది. ఇక రాష్ట్రంలో గుర్తింపు పొందిన 11 రాజకీయ పార్టీలతో ఈరోజు సమావేశం అవుతున్నది.ఒక్కో పార్టీ నుంచి ఇద్దరు ప్రతినిధులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఒక్కో పార్టీకి 15 నిమిషాల సమయం ఇచ్చారు. పార్టీల అభిప్రాయాలను, సలహాలు, సూచనలు తీసుకోబోతున్నారు. అందరి అభిప్రాయాల్ని సేకరించి ఎన్నికల నిర్వహణపై ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల కోసం పార్టీలన్నీ జోరుగా ప్లాన్ చేస్తున్నాయి. అధికార , ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. దుబ్బాక ఓటమితో ఇటు సీఎం కేసీఆర్ కూడా రంగంలోకి దిగారు. ఇవాళ అందుబాటులో ఉన్న మంత్రులతో పాటు.. ముఖ్యనేతలతో కూడా సమావేశంకానున్నారు.మరోవైపు ఎన్నికల అధికారులు కూడా గ్రేటర్ ఎన్నికల కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల పోలింగ్ స్టేషన్ల గుర్తింపు మరియు ప్రచురణ వార్డుల వారీగా నవంబరు 21వ తేదీలోపు పూర్తి చేసేందుకు నోటిఫికెషన్ జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి తెలిపారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. అక్టోబర్ 27న జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించిన రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారుల జాబితాను ఆమోదిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందన్నారు. 

Related Posts