YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

2 కోట్లు దాటిన ఫాస్టాగ్

2 కోట్లు దాటిన ఫాస్టాగ్

న్యూఢిల్లీ, నవంబర్ 12
దేశంలో ఫాస్టాగ్‌ వినియోగదారుల సంఖ్య రెండు కోట్ల మార్క్‌ను చేరిందని నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఈ ఏడాది 400శాతం వృద్ధి నమోదైంది. మొత్తం టోల్‌ వసూలు రోజుకు రూ.92కోట్లకు పెరిగిందని, ఇది రోజువారి టోల్‌ వసూళ్లలో గణనీయమైన పెరుగదల అని పేర్కొంది. ఇంతకు ముందు సంవత్సరానికి రూ.70 కోట్లని చెప్పింది. ప్రస్తుతం మొత్తం వసూళ్లలో దాదాపు 75శాతానికి ఫాస్టాగ్‌ దోహదం చేస్తోందని, జాతీయ రహదారులపై వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరిచేందుకు, కాలుష్యాన్ని తగ్గించేందుకు ఫాస్టాగ్‌ ద్వారా డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహిస్తున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ తెలిపింది. ఫాస్టాగ్‌ రేడియో-ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడీ) సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. దీంతో టోల్‌ ప్లాసాల్లో వాహనాలు ఆపకుండా వెళ్లిపోవచ్చు. ఫాస్టాగ్‌కు బ్యాంక్‌ వ్యాలెట్‌కు అనుసంధానించడంతో ఆటోమెటిక్‌గా డబ్బులు టోల్‌ ఖాతాలో చేరుతాయి. ఇదిలా ఉండగా.. వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రతి వాహనానికి ఫాస్టాగ్‌ తప్పని సరి చేస్తూ నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా ఆదేశాలిచ్చింది. 

Related Posts