YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గుర్రుగా ఉన్న కాళింగులు

గుర్రుగా ఉన్న కాళింగులు

శ్రీకాకుళం, నవంబర్ 13, 
కాళింగులకు ఒక కార్పొరేషన్ జగన్ సర్కార్ ఏర్పాటు చేసింది. దాంతో శ్రీకాకుళం జిల్లా మొత్తం మీద ఉన్న 18 లక్షల ఓట్లు గుత్తమొత్తంగా వైసీపీకి పడతాయనుకుంటే పొరపాటే. ఈ కార్పొరేషన్ కి ఒక చైర్మన్, 12 మంది డైరెక్టర్లతో నియామకాలు అయితే జరిపారు కానీ దానితో పాటే అసంతృప్తి కూడా వెల్లువలా పాకుతూ వచ్చింది. ఎంత చిత్రమంటే చైర్మన్ కి తెలియకుండా డైరెక్టర్ల నియామకం జరిగింది. అసలు ఎవరు డైరెక్టర్లు అన్నది శ్రీకాకుళం జిల్లాలో పెద్ద తలకాయలుగా ఉంటున్న వైసీపీకి చెందిన కాళింగ నేతలకే తెలియకపోవడం అసలైన విడ్డూరంతాజాగా శ్రీకాకుళం జిల్లాలో తాజాగా సమావేశం అయిన కాళింగ కులస్థులంతా ఈ కార్పొరేషన్ మాకొద్దు అని తీర్మానించేశారు. కష్టపడిన వారికి ప్రాతినిధ్యం లేదు. అన్నింటికీ మించి ముక్కూ మొహం తెలియని వారిని తెచ్చి డైరెక్టర్లుగా చేయడమేంటి అని కూడా గుస్సా అయ్యారు. అంతే కాదు వైసీపీ గెలుపు కోసం ఆరుగాలం శ్రమించిన వారికి పదవులు దక్కలేదు అని కూడా మండిపోయారుట. మొత్తానిక్ ఇలా నియామకాలు జరిగాయో లేదో అలా రాజీనామాలు అంటున్నారుట.ఉత్తరాంధ్రలో కాళింగ కులస్థులు అత్యధికం, మొత్తం మూడు జిల్లాలలో దాదాపు ముప్పయి లక్షల దాకా వీరు ఉంటారని ఒక అంచనా. అటువంటి అతి ముఖ్యమైన సామాజికవర్గంలో పదవులు భర్తీ చేసినపుడు జిల్లాలోని కాళింగ పెద్దల నుంచి సలహాలు తీసుకోలేదని విమర్శలు ఉన్నాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం. శ్రీకాకుళం జిల్లా వైసీపీ ప్రెసిడెంట్ కిల్లి కృపారాణి, జిల్లాకు చెందిన వైసీపీ కళింగ నేతలు దువ్వాడ శ్రీనివాస్, పేడాడ తిలక్ వంటి వారితో కనీసం సంప్రదింపులు లేవట. పైగా కాళింగేతర మంత్రుల సూచనల మేరకే కమిటీలో డైరెక్టర్లను వేశారట. ఇంకా చిత్రమేంటంటే టీడీపీకి చెందిన వారికి పదవులు దక్కడం. దాంతో అమీ తుమీ తేల్చుకోవడానికి వైసీపీకి చెందిన కాళింగ పెద్దలు రెడీ అవుతున్నారు.శ్రీకాకుళంలో మూడు ప్రధాన కులాల మధ్య రాజకీయంగా ఆధిపత్య పోరు సాగుతోంది. రాజకీయంగా అతి పెద్ద వాటాను వెలమలు ఎప్పటికప్పుడు కొట్టేస్తున్నారు. ఆ తరువాత వరసలో తూర్పు కాపులు కూడా ఉన్నారు. మరి కాళింగ కులస్థులు జిల్లాలో అత్యధిక జనాభా ఉండి కూడా ఎందుకు ముందుకు రావడంలేదు అంటే వారి మధ్య ఉన్న అనైక్యత కారణంగా చెబుతున్నారు. అంతే కాదు, వారిని అణగదొక్కే విషయంలో మిగిలిన సామాజిక వర్గాలు కూడా ఒక్కటిగా ఉంటున్నాయి. దాంతో జగన్ సీఎం అయినా కూడా కాళింగులకు మంత్రి పదవి దక్కలేదని ఆవేదన చెందుతున్నారు. ఆఖరుకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే అందులో కూడా ఇతర కులాలు వేలూ కాలూ పెట్టి తమకు అన్యాయం చేస్తారా అని కాళింగులు గగ్గోలు పెడుతున్నారు. మరి ఈ కళింగ యుద్ధం వైసీపీని ఏం చేస్తుందో చూడాలి.

Related Posts