పగిడ్యాల నవంబర్ 13
వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రజా సంకల్ప యాత్ర కు మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నందికొట్కూరు నియోజకవర్గం లోని కొత్తపల్లి. పాములపాడు. జూపాడు బంగ్లా. మిడుతూరు. నందికొట్కూరు. ప్రజా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ప్రతి ఒక్కరితో జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాల గురించి వివరిస్తూ శుక్రవారంనాడు పగిడ్యాల మండలం నెహ్రూ నగర్ గ్రామం నుండి ప్రారంభమైన ప్రజా సంకల్ప యాత్ర. కొణిదెల. పగిడ్యాల లక్ష్మాపురం గ్రామాలలో నిర్వహించడం జరిగిందని నందికొట్టుకురు శాసనసభ్యులు తొగుర్ ఆర్థర్. అన్నారు. నెహ్రూ నగర్ నుండి భారీ జన సందోహం మధ్య కొండ గ్రామాన్ని చేరుకున్న ఎమ్మెల్యేకు గ్రామంలోని మహిళా మణులు వైఎస్ఆర్సిపి నాయకులు భారీ మొత్తంలో అక్కడికి చేరుకొని పూల వర్షం కురిపిస్తూ వైఎస్ విగ్రహం వద్దకు చేరుకోవడం జరిగింది వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం ఐదున్నర కిలోమీటర్ల 3 కోట్ల రూపాయల తో కొణిదెల మరియు పగిడ్యాల గ్రామానికి తార్ రోడ్డు భూమి పూజ చేసిన అనంతరం. పగిడ్యాల గ్రామానికి బయలుదేరి పగిడ్యాల గ్రామానికి చెందిన వైఎస్ఆర్ సీపీ నాయకులు గంగిరెడ్డి రమాదేవి. పండుగ జయరాం రెడ్డి. ఆధ్వర్యంలో మేళతాళాలు.బాజా భజంత్రీలతొ స్వాగతం. కిక్కిరిసి అభిమానులు. జనం మధ్య చాలా ఖుషీగా సాగిన పాదయాత్ర పగిడ్యాల గ్రామంలోని వైయస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.