YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సైనికులతో మోడీ దిపావళి

సైనికులతో మోడీ దిపావళి

న్యూఢిల్లీ, నవంబర్ 13 
 ఏటా దీపావళి పండుగను ఆర్మీ జవాన్ల మధ్య జరుపుకొనే సంప్రదాయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి కూడా కొనసాగించనున్నారు. సరిహద్దుల వెంబడి పహరా కాస్తున్న భద్రతా దళాలతో దీపావళి వేడుకలో పాల్గొనేందుకు శనివారంనాడు జైసల్మర్‌కు ప్రధాని వెళ్తున్నట్టు చెబుతున్నారు. అయితే, జైసల్మేర్‌కు బదులు గుజరాత్‌లోని భుజ్‌కు ఆయన వెళ్లే అవకాశాలున్నాయని మరి కొందరు అంటున్నారు. గత ఏడాది జమ్మూజశ్మీర్‌లోని రజౌరి జిల్లా వెళ్లి, ఎల్ఓసీ వెంబడి మోహరించిన జవాన్లతో దీపావళి వేడుకలు చేసుకున్నారు.ప్రధానిగా ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పాకిస్థాన్, చైనా సరిహద్దుల్లోని జవాన్లతో వివిధ లొకేషన్లలో దీపావళి వేడుకల్లో ఆయన పాల్గొంటూ వస్తున్నారు. 2014లో లడఖ్‌ ప్రాంతంలోని సియాచిన్‌లో దీపావళి జరుపుకోవడంతో పాటు శ్రీనగర్‌లో వరద బాధితులను పరామర్శించారు. 2015లో పంజాబ్ సరిహద్దు్లో పర్యటించారు, 2016లో హిమాచల్ ప్రదేశ్ వెళ్లి ఇండో-టిబిటెన్ సరిహద్దు పోలీసు సిబ్బందితో దీపావళి జరుపుకొన్నారు. 2017లో జమ్మూకశ్మీర్‌లోని గురెజ్ సెక్టార్‌లోనూ, 2018లో ఉత్తరాఖండ్‌లోని ఇండియా-చైనా సరిహద్దు వెంబడి మంచుప్రాంతాల్లో ఆర్మీ, ఐటీబీపీ సిబ్బందితో దీపావళి వేడుకలో పాల్గొన్నారు.

Related Posts