YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీ నేతలకు జగన్ వార్నింగ్

వైసీపీ నేతలకు  జగన్ వార్నింగ్

విశాఖపట్టణం, నవంబర్ 13 
విశాఖపట్నం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వాగ్వాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యి.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్లు పెద్ద ఎత్తున కథనాలు వస్తున్న విషయం విదితమే. ఈ తరుణంలో వైసీపీ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖపట్నం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఉదయం విశాఖలోని ప్రభుత్వ అతిథి గృహంలో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మ శ్రీ, ఎంపీ సత్యనారాయణతో పాటు పలువురు ఎమ్మెల్యేలు, జిల్లాకు చెందిన సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన తాజా రాజకీయ పరిణామాలు, జిల్లాలో చేరికలతో పాటు పలు కీలక విషయాలపై చర్చించారు. సుమారు గంటపాటు జరిగిన ఈ భేటీ జరిగింది. శుక్రవారం సాయంత్రం గత రెండు మూడ్రోజులుగా సోషల్ మీడియాలో, మీడియాలో వస్తున్న వార్తలపై విజయసాయిరెడ్డి మీడియా సమావేశం నిర్వహిస్తారని తెలుస్తోంది.అయితే విజయసాయిరెడ్డితో సమావేశం అనంతరం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ జిల్లాలో వైసీపీ నేతల మధ్య ఎటువంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఏమీ లేకున్నా కొంత మంది పనిగట్టుకుని మరీ రచ్చ చేస్తున్నారంటూ వాసుపల్లి మండిపడ్డారు. కేవలం సంక్షేమ పథకాలపై మాత్రమే ఈ భేటీలో చర్చించామన్నారు. ప్రజల సమస్యల్ని ఎమ్మెల్యేలు చెబుతారని.. వాటినే డీఆర్సీ సమావేశంలో చర్చించామని చెప్పుకొచ్చారు. జిల్లాలో నేతలందరం కలిసి సమన్వయంతో పని చేస్తామని గణేష్ మీడియా వెల్లడించారు.అలాగే అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. అధిష్టానానికి ఎమ్మెల్యేలకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. డీఆర్సీ మీటింగ్‌లో లేనివి ఉన్నట్లు మీడియా చూపించే ప్రయత్నం చేసింది. అనకాపల్లిలో నాడు నేడు కార్యక్రమం సవ్యంగా జరగాలని మీటింగ్‌లో ప్రస్తావించగా, కొందరు దాన్ని వక్రీకరించి చూపించారని మండిపడ్డారు. డీఅర్సీ అంశంపై అమరావతి వెళ్లామని, ఎవరికి నచ్చినట్లుగా వాళ్లు వార్తలు రాసుకున్నారని విమర్శించారు. సీఎం జగన్ నుంచి మాకు పిలుపే రాలేదని.. మేం అమరావతికే వెళ్లలేదని చెప్పారు.

Related Posts