నవంబర్ 13
దీపావళి టపాకాయలపై నిషేధం మా కుటుంబాల పాలిట శాపంగా మారనుందని...హైకోర్టు తమ పరిస్థితి పై పునరాలోచించి, టపాకాయల అమ్మకం కొనసాగించడం, వినియోగదారులకు అవకాశం కల్పించాలని కోరుతూ జిల్లా కేంద్రంలో టపాకాయల దుకాణాదారులు పట్టణంలోని ప్రధాన రోడ్డు పై బైఠాయించి,నిరసన తెలుపుతూ వారి పరిస్థితిని వివరించారు. కరోనా కోవిడ్ 19 పరిస్థితులదృష్ట్యా దీపావళి టపాకాయలపై నిషేధం విధిస్తూ...ఒక న్యాయవాది వేసిన పిల్ పై ఆదేశాలు వెలువరించిన సంగతి తెల్సిందే. దీంతో శుక్రవారం సాయంత్రం నుండి దీపావళి టపాకాయల హోల్ సేల్ డీలర్లు, రిటేల్ వ్యాపారస్థులపై తీవ్ర ప్రభావం పడింది. లక్షలాది రూపాయలతో గత నాలుగైదు నెలలనుంచే శివకాశి నుంచి టపాకాయలు తెచ్చి, నిలువ చేసుకుని, గత వారం నుంచి వివిధ ప్రాంతాల రిటేల్ వ్యాపారస్థులు అడ్వాన్స్ సైతం ఇచ్చి కొంత మొత్తం టపాకాయలు తీసుకు వెళ్లారని వివరించారు. అంతేగాకుండా, రిటైల్ అమ్మకం కోసం అధికారుల ప్రకటనల మేరకు దరఖాస్తులు సైతం ఆర్డీఓ కార్యాలయంలో దరఖాస్తులు కూడా ఇవ్వడం జరిగిందన్నారు.మున్సిపల్, ఫైర్ అధికారుల అనుమతి కోసం విన్నవించుకున్నామని టపాకాయల దుకాణాదారులు వివరించారు.దీంతో మినీ స్టేడియంలో ముందస్తుగా శనివారం టపాకాయల రిటైల్ అమ్మకం కోసం షెడ్స్ తయారు చేసుకున్నామన్నారు. అకస్మాత్తుగా ఓ న్యాయవాది హిందువుల పండుగలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వేసిన పిల్ పై... హైకోర్టు ఇచ్చిన టపాకాయలపై నిషేధం ఆదేశాలు దురదృష్టకర మన్నారు.అకస్మాత్తుగా తమపాలిట "టపాకాయల నిషేధం" శాపంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి టపాకాయల అమ్మకంపై వేలాది మంది జీవనం ఆధారపడి ఉందని,మామనవతా దృక్పథంతో పునరాలోచించి..టపపాకాయలు అమ్మకం కొనసాగించేలా, వినియోగదారులు టపాకాయలు కొనేలా, ఉపయోగించేలా అవసరమైన ఉత్తర్వులు ఇప్పించాలని ప్రభుత్వం ద్వారా కోరుతున్నామన్నారు...ఈ మేరకు..తమ పరిస్థితిని విన్నవించడం కోసం తహసిల్ చౌరస్తాలో కొద్దిసేపు ప్రధాన రహదారిపై బైఠాయించి... జగిత్యాల జిల్లా కలెక్టర్ కు ఆర్డీఓ ద్వారా వినతి పత్రం అందిస్తున్నామని హోల్ సేల్, రిటైల్ అమ్మకం వ్యాపారస్థులు వెల్లడించారు.