హైదరాబాద్ నవంబర్ 13
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతీ ఇంటి లోగిలి కార్తీక దీప కాంతులతో వెలుగు లీనాలని, అన్నదాత కళ్లల్లో ఆనందపు కాంతులు వెల్లివిరియాలని కేసీఆర్ ఆకాంక్షించారు. అజ్ఞానాంధకారాలు తొలగించే విజ్ఞానపు వెలుగును దీపావళి ప్రసాదించాలని వేడుకున్నారు.