YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబువి శవరాజకీయాలు

చంద్రబాబువి శవరాజకీయాలు

విజయవాడ నవంబర్ 13 
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు  ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటామని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది.  అధికారంలో ఉండగా చంద్రబాబు కి మైనారిటీలు ఒక్కరోజు కూడా గుర్తుకు రాలేదని వైఎస్ఆర్ సీపీ వైద్య విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ అన్నారు.   ఇప్పుడు నంద్యాలలో ఇద్దరు పోలీసులు తప్పు చేస్తే సలాం కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం అత్యంత సీరియస్ గా తీసుకుంది. సీఎం  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తక్షణమే స్పందించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేశారు. సలాం గారి అత్త గారికి రూ.25 లక్షలు అందించారని అయన అన్నారు.  అధికారంలో ఉండగా మైనారిటీలను పూర్తిగా విస్మరించిన చంద్రబాబు, ఇప్పుడు శవరాజకీయాలు చేస్తున్నారు. నిందితులను పోలీసులు అరెస్టు చేస్తే టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగాఉన్న న్యాయవాది వారి తరఫున వాదించి బెయిల్ ఇప్పించారు. ఈ విషయం ప్రజలకు తెలియడంతో ఆ న్యాయవాదితో పార్టీకి రాజీనామా చేయించారు. కానీ నిందితుల తరఫున బెయిల్ పిటిషన్ వేయవద్దు. వారు చేసింది తప్పు. శిక్ష పడేలా కోర్టులో వాదించండి అని మాత్రం చెప్పలేదు. కేవలం మైనారిటీలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలనే దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారని అన్నారు.
 చంద్రబాబు  ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గుంటూరులో 'నారా.. హమారా' పేరుతో సభ పెట్టి అబద్ధాలు చెబుతుండగా, నిరసన తెలిపి ముస్లిం యువకులపై దేశద్రోహం అంతటి నేరం చేసినట్లు కేసు పెట్టారు. చాలా రోజులు బెయిల్ కూడా రాకుండా వాళ్లు జైలులో మగ్గేలా చేసి కక్ష తీర్చుకున్నారు.  వైఎస్ జగన్  ముఖ్యమంత్రి అయిన తర్వాత గుంటూరు ముస్లిం యువకులపై కేసులను ఎత్తి వేస్తే మళ్లీ కొందరు కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారు. చంద్రబాబు  హయాంలో వక్ఫ్ బోర్డును తన తాబేదార్లకు అప్పగించి నిర్వీర్యం చేశారు.   టీడీపీ ప్రభుత్వంలో మైనారిటీలకు ప్రాతినిధ్యం లేకుండా చేశారు. నాలుగేళ్ల పాలన తర్వాత నంద్యాల ఉప ఎన్నికల సమయంలో షరీఫ్ కి మండలి చైర్మన్ పదవి ఇచ్చారు.   మైనారిటీలకు మేలు చేసేందుకు చేతులు రాని చంద్రబాబు గారికి ఇప్పుడు శవరాజకీయాలు చేసి మైనారిటీలను రెచ్చగొట్టేందుకు మాత్రం గొంతు బాగా వస్తుంది.  చంద్రబాబు  ఎన్ని అబద్దాలు చెప్పినా మైనారిటీలు నమ్మరు.  చంద్రబాబు  నైజం ఎరిగిన మైనారిటీలు ఆయనకు తగిన బుద్ది చెబుతారు.  రాష్ట్రంలో మైనారిటీలకు మేలు చేసింది నాడు దివంగత సీఎం వైఎస్ఆర్ గారు. నేడు చేస్తున్నది ఆయన తనయుడు  మాత్రమే. ఈ విషయం రిజర్వేషన్, ఫీజు రీయింబర్స్ మెంట్ వల్ల చదువుకుంటున్న  పిల్లలు నుంచి గౌరవ వేతనాలు పొందుతున్న ఇమాంలు, మౌజమ్ ల వరకూ అందరికి తెలుసు.  ఇక టీడీపీ శవరాజకీయాలు మానుకుని బాధ్యత గల ప్రతిపక్షంగా మెలిగితే మంచిది. లేకపోతే వచ్చే ఎన్నికల్లో 23 సీట్లు కూడా దక్కవని అయన అన్నారు.

Related Posts