న్యూఢిల్లీ నవంబర్ 13
తెలంగాణలో బాణాసంచా కాల్చేందుకు సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 8 గంటల నుండి 10 గంటల వరకు టపాసులు కాల్చేందుకు అనుమతి నిచ్చింది. ఈ మేరకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం జరిపిన విచారణలో దీపావళి బాణాసంచా పెల్చుడు విషయంలో నిలిపివేసిన హైకోర్టు ఉత్తర్వులను మార్చింది. గ్రీన్ కాకర్స్ ను మాత్రమే కల్చుకోవచ్చని అనుమతినిచ్చింది. పర్యావరణకు లోబడిన కాకర్స్ ను మాత్రమే కాల్చాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా తెలంగాణ కాకర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టు కు వెళ్ళింది. ఇంతకుముందే దీపావళి రోజున రెండు గంటల పాటు కాల్చుకునేందుకు అనుమతినిచ్చిన ఎన్ జీటీ. ఆ రెండు గంటల సమయాన్ని కేటాయించుకునే అవకాశం ప్రభుత్వానికి సుప్రీం అవకాశం ఇచ్చింది.