న్యూఢిల్లీ నవంబర్ 14
పాకిస్థాన్ సైన్యం మరోసారి బరితెగించింది. జమ్ముకశ్మీర్ రాష్ట్రం బారాముల్లా జిల్లాలోని భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడికి దిగింది. ఈ దాడిని భారత సేనలు సమర్థంగా తిప్పికొట్టాయి. భారత్ ఎదురుదాడికి తాళలేక పాక్ సేనలు తోకముడిచాయి. అయితే, అంతకుముందు పాకిస్థాన్ అకస్మిక దాడికి పాల్పడంతో.. ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే మనవైపు జరుగాల్సిన నష్టం జరిగిపోయింది.పాకిస్థాన్ సైనికులు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో బిఎస్ఎఫ్ ఎస్ఐ రాకేశ్ దోహల్ తలలోకి బుల్లెట్ దూసుకుపోయింది. దాంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దోహల్‌తోపాటు బిఎస్ఎఫ్ కే చెందిన ఒక కానిస్టేబుల్, నలుగురు సాధారణ పౌరులు మృతిచెందారు. రాకేశ్ దోహల్ ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ జిల్లా గంగానగర్‌కు చెందిన వ్యక్తిగా ఆర్మీ వెల్లడించింది.