YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

దీపావళి వేళ చిన్నారిపై కానిస్టేబుల్ కర్కశం...

దీపావళి వేళ చిన్నారిపై కానిస్టేబుల్ కర్కశం...

లక్నో  నవంబరు 15 
యూపీలో బాణసంచాపై నిషేధం విధించారు. అయినా బులంద్ షహర్ లో పలువురు దుకాణదారులు షాపులను ఏర్పాటుచేసి బాణసంచా అమ్ముతున్నారు. ఇందులో బాగంగానే ఒక చిరు వ్యాపారి.. కొన్ని టపాసులతో చిన్న షాపును ఏర్పాటుచేసుకున్నాడు. అక్కడ అతడొక్కడే గాక చాలామంది షాపులు పెట్టుకున్నారు. కానీ పోలీసులు మాత్రం ఆ వ్యక్తి దగ్గరకు వచ్చి షాపులోని టపాసులను చిందరవందరగా పడేశారు. ఆ వ్యక్తిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. ఇదే సమయంలో అక్కడే ఉన్న ఆ వ్యక్తి ఇద్దరు కూతుళ్లు.. పోలీసులను అడ్డుకున్నారు. తమ తండ్రిని తీసుకుపోవద్దని బతిమిలాడారు. కానీ పోలీసులు మాత్రం వారి మాటలు వినిపించుకోలేదు. ఆ వ్యక్తిని తీసుకెళ్లి జీపు ఎక్కించబోయారు. ఇది చూసి తట్టుకోలేని ఆయన కూతురు.. తన తండ్రిని వదిలేయాలని జీపుకు తల బాదుకుంది. అక్కడే పలువురు పోలీసులున్నా.. ఆ చిన్నారిని పక్కకు తీయలేదు. అది చూసి అక్కడ ఉన్నవాళ్లంతా చలించిపోయారు.చిన్నారి రోధన తర్వాత అక్కడున్న పలువురు ఆ వ్యక్తిని విడిచిపెట్టాలని కోరినా పోలీసులు మాత్రం వారిని వినిపించుకోలేదు. అడ్డమొచ్చిన వారిని కాళ్లతో తంతూ.. వారిని బెదిరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ... పోలీసుల వైఖరిని తప్పుబడుతున్నారు. పేదవారిపైనే వారి ప్రతాపం ఉంటుందని.. పెద్ద పెద్ద టపాసుల షాపులను పెట్టినవారిని పోలీసులు ఏమీ అనరని విమర్శలు చేస్తున్నారు.

Related Posts