ఇన్నాళ్లు మైత్రీ బంథం కొనసాగిన టీడీపీ జనసేన మద్య మాటల యుద్దం కొనసాగుతోంది...జనసేన అధినేత పవన్ ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను టీడీపీ నేతలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్నారు...తాజాగా మరో అంశంపై జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ తిరుపతిలో పర్యటించాలని డిసైడ్ అయ్యారు..అయితే దీనిపై టీడీపీ నేతలు పవన్ పై విమర్శలు సందిస్తున్నారు..మరోవైపు ప్రభుత్వం కూడా పవన్ కు అవకాశం ఇవ్వకుండా పాలనా పరమైన సమస్యపై ఫోకస్ పెట్టింది...ఇంతకీ తిరుపతి సమీపంలోని శెట్టిపల్లె వాసుల సమస్య ఏంటి
తిరుపతికి సమీపీంలోని శెట్టిపల్లె గ్రామంలో ఈ నెల 23న పర్యటించేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యారు..శెట్టిపల్లెలో ఫైనాన్షియల్ సిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది..శెట్టిపల్లెలో చాలా మంది రైతుల వద్ద భూములకు సంబంధించిన సరైన పత్రాలు లేక పోవడంతో సమస్యలు ఎదురవుతున్నాయి...దాదాపు మూడు వేల మందికి చెందిన భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది..దీంతో తమకు న్యాయం చేయాలని శెట్టిపల్లెకు చెందిన స్థానికలు జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు..ఎంతో కాలంగా తాము సాగు చేసుకుంటున్న భూములను ప్రభుత‌్వం స్వాదీనం చేసుకుంటుందని పవన్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ నెల 23న శెట్టిపల్లెకు వచ్చి న్యాయం జరిగేలా చూస్తానని పవన్ వారికి భరోసా అచ్చారు.
మరోవైపు పవన్ కళ్యాణ్ పర్యటనపై తిరుపతి టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు...వపన్ శెట్టిపల్లె పర్యటనకు ముందే ఎదురు దాడి చేస్తున్నారు...శెట్టిపల్లె ప్రజల సమస్యలను పరిస్కరించేందుకు తెలుగు దేశం ప్రభుత్వం..స్తానిక ఎమ్మెల్యే ఇతర నేతలు అధికారులు సిద్ధింగా ఉన్నారని వపన్ కు కౌంటర్ ఇస్తున్నారు...ఎలాంటి సమస్య అయినా పరిష్కరించి ప్రజలకు న్యాయం చేస్తామని గట్టిగా చెబుతున్నారు...పవన్ శెట్టిపల్లెకు రావాల్సిన అవసరం కూడా లేదని గట్టిగా చెబుతన్నారు...శెట్టిపల్లెలో జరిగే అభివృద్ధిన అడ్డుకోవద్దని కూడా టీడీపీ నేతలు జనసేన ఛీఫ్ కు ఉచిత సలహా ఇస్తున్నారు.మరోవైపు ప్రభుత్వం కూడా శె్టిపల్లె సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టింది..శెట్టిపల్లెలో రాజధాని అమరావతి తరహాలో ల్యాండ్ ఫూలింగ్ లో భూములను సేకరించి ఇంటి స్థలాలు కేటాయించేలా అధికారులు చర్యలు చేపట్టారు..శెట్టిపల్లెలో నివసించే ఎవరి వద్ద సరైన పత్రాలు లేకపోవడంతో ఇక్కడి భూములన్నీ సర్కార్ భూములుగా పరిగణిస్తున్నారు..గ్రామంలో దాదాపు 640 ఎకరాలకు పైగా భూముల్లో బిల్డింగులు వెలిశాయి.. చాలా మంది రియల్టర్లు ఇక్కడి భూములను కబ్జా చేసారు..గతంలో ప్రభుత్వం సర్వేలు చేసినా ఎవరూ సరైన పత్రాలు సమర్పించలేదు..ఖాళీగా ఉన్న భూములను సమీకరించి ఫైనాన్షియల్ నగరాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది..150 ఎకరాలకు సంబంధించిన భూమిని ల్యాండ్ ఫూలింగ్ ద్వారా భూములను స్వాధీనం చేసుకొని 45 శాతం భూమిని ప్రజల అవసరాలకు కేటాయించాలని ప్రభుత్వం బావిస్తోంది..ఎకరాల స్థలం ఉన్న వారికి 20 సెంట్ల స్థలం ఇచ్చేలా..కేవలం రెండు సెంట్ల స్థలం ఉన్నవెయ్యి మందికి ఒక్కొక్కరికి 50 చదరపు గజాల స్థలాన్ని ఇవ్వాలని నిర్ణయించారు...
బైట్: ప్రద్యుమ్న.. జిల్లా కలెక్టర్
ఎండ్ వాయిస్:
మొత్తం మీద .ఈ నెల 23న తిరుపతి సమీపంలోని శెట్టిపల్లెలో పవన్ పర్యటన టీడీపీ జనసేన మధ్య మరింత వేడిని పుట్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి....