విశాఖపట్నం నవంబరు 15
విశాఖ ఏజెన్సీలో చలిగా లులు విజృంభిస్తున్నాయి.కనిష్ట ఉష్ణో గ్రతలు నమోదవుతుండటంతో చలి తీవ్రత అధికంగా ఉంది.మన్యం ప్రజలు చలిగాలులతో వణుకుతు న్నారు.వాతావరణం మరింత చల్లగా ఉంటుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గిరిజనులంతా తమ ఇంటి పరిసరాల్లో చలి మంటలు వేసుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.రాత్రి వేళల్లో చలి మరింత విజృంభిస్తుండటంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. అర్ధరాత్రి నుంచే పొగమంచు దట్టంగా కురుస్తోంది. ఉదయం 10 గంటల వరకు ఏజెన్సీలో మంచు తెరలు వీడకపోవడంతో వాహన చోదకులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే గిరిజనులు సూర్యోదయం అయ్యేంతవరకు ఇళ్లకే పరిమితమవుతున్నారు. చిన్నారులు, వృద్ధులు చలిని తాళలేక అవస్థలు పడుతున్నారు. వేకువజామునే నీళ్ల సేకరణకు వెళ్లే మహిళలు కూడా వణికించే చలితో భయాందోళనలు చెందుతున్నారు. కాశ్మీర్ గా పేరు పొం దిన పాడేరులో మంచు అందాలు ప్రకృతి ప్రేమికులను మైమరపిస్తు న్నాయి.సోయగాలు కనువిందు చేస్తుండడంతో కొంతమంది ఈ అందా లను ఆస్వాదించేందుకు తరలి వస్తున్నారు.ఎత్తయిన కొండల్లో గుట్టలో నుండి చూస్తే మంచు పై మెఘాలలో తేలి ఆడుతున్నట్లు ఉంటుంది. అరకు, పాడే రు ప్రాంతాల్లోనూ మెగాల్లో, మంచు తెరలతో కొత్త అందాలు సంతరించు కుంటున్నాయి.గిలిగింతలు పెట్టే చలి గాలులు విశాఖ ఏజెన్సీ పాడేరులో వణికిస్తున్నాయి. పర్యాటకులకు రారమ్మని ఆహ్వానం పలుకుతూ మన్యం అందాలు స్వాగతం పలుకు తున్నాయి.ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే విశాఖ మన్యంలో ఆకుల నుంచి జాలువారు తున్న మంచు బిందువులు ప్రకృతి సొగసును మరింత ఇనుమడింప చేస్తున్నాయి. ఇవన్నీ విశాఖ జిల్లా మన్యం లో,పర్యాటకులను కనువిందు చేస్తున్నాయి.ఈ ఏడాది కరోనా మహ మ్మారి వాళ్ళ పర్యాటక ప్రదేశాలు బోసిపోయాయి. ప్రకృతి అందాలను వీక్షించేందుకు వచ్చినవారు ఈ వాతావరణానికి మంత్రముగ్ధుల వుతున్నారు.