ఏలూరు నవంబర్ 15
సోమవారం నుంచి కార్తీక మాసం ప్రారంభం కానుండడంతో పశ్చిమ గోదావరి జిల్లా లోని శైవక్షేత్రాలు, పాలకొల్లు, భీమవరం లోని పంచారామ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. భీమవరం పట్టణం లోని (సోమారామం) పంచారామ క్షేత్రంలో కోవిడ్ - 19 నిబంధనలకు అనుగుణంగా దైవదర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. దీపారాధనలు, సాలగ్రామ దానాలు, రుద్రాభిషేకములు, సామూహిక పూజలు నిలిపివేపారు. దైవదర్శనానికి విచ్చేయనున్న భక్తులందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. ఇతర కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందిగా అధికారులు సూచించారు.