YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఏప్రిల్ 23 యుగాంతమా...

ఏప్రిల్ 23 యుగాంతమా...

ఏప్రిల్ 23న యుగాంతం ఎఫెక్ట్ పీక్స్ కు చేరుకుంటుందని అంటున్నారు కాన్స్పిరసీ థియరిస్టులు. ఈ మేరకు సిద్ధాంతాలూ వినిపిస్తున్నారు. ఓ మిస్టరీ గ్రహం భూ కక్ష్యలోకి వస్తుందని దీంతో వినాశనం స్టార్టవుతుందని చెప్తున్నారు. అయితే ఖగోళ శాస్త్రవేత్తలు మాత్రం ఈ వాదనలను కొట్టిపారేస్తున్నారు. భూమికి ఢోకా లేదని స్పష్టం చేస్తున్నారు.యుగాంతం.. కొందరు ఇదో సిల్లీ అంశమని కొట్టి పారేసినా మరికొందరు మాత్రం చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఇలాంటి వారే కొద్ది రోజుల్లే భయానక విధ్వంసం సంభవించనుందని అంటున్నారు. నిబురు అనే గ్రహం యుగాంతానికి కారణమవుతోందని చెప్తున్నారు.భూమిపై ప్రకృతి విపత్తులు తరచూ గందరగోళం సృష్టిస్తుంటాయి.  విశ్వంలోనూ ఈ తరహా కన్ఫ్యూజన్ ఉంటుంది. విపత్తులు వచ్చినంత మాత్రాన భూమి కకావికలం అయిపోలేదు. విశ్వం కూడా అంతే అని యుగాంతం వట్టి మాటే అని తేల్చి చెప్తున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.యుగాంతం ఖాయమంటున్న డేవిడ్ మీడ్ క్రిస్టియన్ న్యూమరాలజిస్ట్. ప్లానెట్ ఎక్స్ భూమివైపు దూసుకొస్తోందని స్పష్టం చేస్తున్న మీడ్ గతేడాదే డూమ్స్ డే ఎఫెక్ట్ పుంజుకుందని చెప్తున్నారు.పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ నానుడి... విశ్వానికీ వర్తిస్తుందా? అద్భుతమమైన గెలాక్సీలు, అందమైన పాలపుంతల సమాహారం తుడిచిపెట్టుకుపోతుందా? సృష్టి గమనం ఆగిపోతుందా? అంటే.. అవుననే అంటున్నారు ఖగోళ శాస్త్రవేత్తలు.

Related Posts