ఒంగోలు, నవంబర్ 16,
ఇంట్లో ఉందేమో విత్తనాల గింజలు.. చూస్తేనేమో దూరపు చుట్టము. వండి పెట్టలేము.. వండకుండ ఉండలేము. ఎస్ ఎగ్జాక్ట్ గా ఇదే సిచ్చువేషన్ ఉంది ఏపీలో. సీఎం జగన్ ఇదే ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. చీరాలలో అయితే ఈ ప్రాబ్లమ్ పీక్స్ లో ఉంది. ఓ పక్క ఆ మంచి పార్టీ లీడర్.. ఓడినా కానీ.. నమ్ముకున్న నమ్మదగిన లీడర్. మొన్నటి దాకా.. నియోజకవర్గంలో తన వర్గం రారాజులా నుంచుంది. సడన్ గా కరణం బలరాం వచ్చారు. ఆయన కొడుకు కూడా జై కొట్టారు. ఇప్పుడు అంతా రివర్స్ అయింది.చూస్తేనేమో కరణం బలరాం కుమారుడు మాంచి దూకుడు మీదున్నారు. అన్న చెప్పాడు.. అన్న చెప్పాడు అంటూ రచ్చబండలో నుంచుని రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇటు చూస్తేనేమో.. ఆ మంచికి, ఆయన వర్గానికి మింగుడు పడని ఎవ్వారం ఇది. ఇన్ సైడ్ గా రచ్చ నడుస్తుంటేనే భరించలేరాయే. ఇక బయటికొచ్చి కామెంట్లు చేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా. లోకల్ గా రెండు వర్గాలు రెచ్చి పోతున్నాయి. మీటింగుల్లో ప్లాస్టిక్ కుర్చీల దగ్గర కూడా ఈగో ప్రాబ్లమ్స్ వస్తున్నాయట.అంతే కదా మరి. ఐదు రూపాయల కోసం మర్డర్లు చేసుకున్న రోజులు కదా చరిత్ర. అలాంటిది చిన్న చిన్న విషయాలకు కొట్టుకునేదాకా వెళ్లడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి. కానీ.. కరణం, ఆయన కుమారుడి సైడే జగన్ ఉన్నారని.. కరణం ఎమ్మెల్యే కావడంతో ఆమంచిని లైట్ తీసుకున్నారని.. లోకల్ గా ఆమంచి టీమ్ చాలా డిసప్పాయింట్ అవుతోందంట. ఆ మంచిని కూడా పార్టీ మారాలని చాలా మంది సజెస్ట్ చేస్తున్నారట కూడా. అసలే బీజేపీ ఎప్పుడెప్పుడా అని చూస్తోంది.తెలంగాణలో వేసినట్లుగానే ఏపీలో కూడా పాగా వేయాలనే ప్లాన్ లో ఉంది. ఇలా డిసప్పాయింట్ అయిన లీడర్లందరినీ పోగేసిందంటే.. వచ్చే ఎన్నికల్లోగా.. సమ్ థింగ్ జరగొచ్చు అంటున్నారు అనలిస్టులు. బీజేపీ కూడా సమ్ థింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా అనే ఆలోచనలో ఉన్నారట. ఇలాంటివి కట్టడి చేయాలని వైసీపీ కూడా బానే స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిందంట. కాకపోతే. .కరణం బలరాం కుమారుడి వ్యాఖ్యలు చూస్తుంటే మాత్రం.. సీఎం జగన్ వాళ్లకే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వబోతున్నారు అనే విషయం కనిపిస్తోంది. కానీ.. పంచాయితీ నేరుగా టేబుల్ మీదికి వెళ్తే కానీ.. కొలిక్కి వచ్చే అవకాశం కనిపించడం లేదు..