YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు

హైద్రాబాద్, నవంబర్ 16, 
నైజీరియన్‌ సైబర్‌నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలిచ్చి సహకారం అందిస్తున్న బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తిని సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం... బెంగళూరు హూడి, అయ్యప్పనగర్‌కు చెందిన ఎంఎన్‌ అశోక్‌ ఓ ప్రైవేట్‌ బ్యాంకులో హోం లోన్స్‌ ఎగ్జిక్యూటివ్‌. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఇతడికి ఆదాయం తగ్గిపోయింది. ఆ సమయంలో ఈశా న్య రాష్ర్టాలకు చెందిన ఓ మహిళ పరిచయం అయ్యింది. తనకు బ్యాంకు ఖాతాలు ఇస్తే.. నీకు కమీషన్‌ ఇస్తానంటూ ఒప్పందం చేసుకుంది. దీంతో అశోక్‌ తన రెండు బ్యాంకు ఖాతాలు ఆమెకు ఇచ్చాడు. సదరు మహిళ నైజీరియన్‌ సైబర్‌నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలు అందించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. ఇదిలాఉండగా.. ఈ ఏడాది ఆగస్టు నెలలో ఫేస్‌బుక్‌లో  బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తికి కెనడా నుంచి.. తమది చారిటబుల్‌ ట్రస్ట్‌ అంటూ గుర్తుతెలియని వ్యక్తులు పరిచయం అయ్యారు. కొన్నా ళ్లు ఫేస్‌బుక్‌లో చాటింగ్‌ చేసుకున్నారు.ఆ తరువాత ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో మీ ట్రస్ట్‌ తరపున మాస్క్‌లు, ఇతర సామగ్రితో పాటు విలువైన బహుమతులు, ఆర్థిక సహాయం బహుమతిగా పంపిస్తామంటూ నమ్మించారు. ఆ తరువాత ఎయిర్‌పోర్టు లో కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారంటూ బాధితుల నుంచి రూ. 24 లక్షలు నైజీరియన్‌ సైబర్‌నేరగాళ్లు లాగేశారు. ఈ కేసు దర్యాప్తులో బాధితులు డబ్బులు డిపాజిట్‌ చేసిన బ్యాంకు ఖాతాలను ఆరా తీయగా... అశోక్‌ ఖాతాల వివరాలు వెల్లడయ్యాయి. ఈ కేసులో రూ. 3.2 లక్షలు నిందితుడి ఖాతాలో డిపాజిట్‌ అ య్యాయి. అయితే ఇతర బాధితుల నుంచి సైబర్‌నేరగాళ్లు ఈ ఖాతాల్లో మొత్తం రూ.46లక్షల వరకు డిపాజిట్‌ చేయించినట్లు దర్యాప్తులో వెల్లడయ్యింది. దీంతో ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ నేతృత్వంలో ఇన్‌స్పెక్టర్‌ వెంకట్రామిరెడ్డి బృందం బెంగళూర్‌కు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకొని నగరానికి తరలించారు

Related Posts