YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గ్రేటర్ లో బస్తీమే సవాల్

గ్రేటర్ లో బస్తీమే సవాల్

హైద్రాబాద్, నవంబర్ 16, 
పార్టీ పెట్ట‌గానే స‌రిపోదు. కేడ‌ర్ ని మేపాలి. లీడ‌ర్ల‌ని దువ్వాలి.. బెదిరించాలి, బ‌తిమాలి బామాలాలి. వీట‌న్నీటికంటే ఇంపార్టెంట్ ఉనికి. ఉనికి లేకుంటే.. పార్టీని మ‌ర్చిపోతారు జ‌నాలు. అందుకే.. ఏ పార్టీ అయినా.. పోటీ చేస్తుంది. గెల‌వం అని తెలిసినా స‌రే.. కోట్ల‌కి కోట్లు ఖ‌ర్చు పెడుతుంది. య‌ట్ లీస్ట్ కోటి దాకా అయినా వెళ్తుంది. జెండాలు ర్యాలీలు అనే విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌రు. ఇప్పుడు.. మూడు ప్ర‌ధాన పార్టీలు అదే ప‌నిలో ఉన్న‌య్. టీఆర్ఎస్ దే హ‌వా. టీఆర్ఎస్ కి ఎంఐఎం తోడుంది. సో.. గెల‌వ‌డం క‌ష్టం. ఈ రెండు పార్టీల్ని ఓడించ‌డం అంటే మామూలు విష‌యం కాదు. కానీ.. బీజేపీ కాలు దువ్వుతోంది. సెంట్ర‌ల్ స‌పోర్ట్ ఉండ‌డం వ‌ల్ల‌.. ఇక్క‌డ పాగా వేయాల‌ని అక్క‌డ స్ట్రాంగ్ గా ఫిక్స్ కావ‌డం వ‌ల్ల‌.. మొన్న దుబ్బాక‌లో దుమ్మురేప‌డం వ‌ల్ల‌.. బ‌లంగానే మూవ్ అవుతోంది. ఇంత‌కు ముందు.. సిటీలో బీజేపీకి పెద్ద‌గా ప‌ట్టు లేకున్నా.. ఈసారి మాత్రం అలా కాదు.. హైద‌రాబాద్ మాదే అంటోంది. కానీ.. గెలిచినా గెల‌వ‌క‌పోయినా.. మేం త‌క్కువేం కాదు అని నిరూపించుకోవాల‌ని గ‌ట్టిగానే ఫిక్స్ అయింది బీజేపీ.ఇక కాంగ్రెస్ కూడా అంతే. ఇదీ నేష‌న‌ల్ పార్టీనే అయినా.. అధికారంలో లేదు. కాక‌పోతే.. హైద‌రాబాద్ పై బానే ఫోక‌స్ చేశారు లీడ‌ర్లు. ఇక్క‌డ కూడా ఓడిపోతే.. జ‌నం మ‌ర్చిపోతారు అనే భ‌యంలో ఉంది. అస‌లే లీడ‌ర్లు ఎప్పుడు జంప్ అవుదామా అని చూస్తున్నారు. దుబ్బాక ఎల‌క్ష‌న్ల‌తో అంతా మారిపోయింది. ఇక హైద‌రాబాద్ లో సీట్లు కానీ రాక‌పోతే.. క్యాడ‌ర్ ని కాపాడ్డం క‌ష్టం. అందుకే.. కాంగ్రెస్ ఉనికి చాటుకోవాల‌నే ప్లాన్ లో ఉంది. ఇక టీడీపీ కూడా అంతే. మామూలుగా తెలంగాణ‌లో బాగా వీక్ అయింది టీడీపీ. ఆంధ్ర‌ప్ర‌దేశ్ పైనే ఎక్కువ ఫోక‌స్ చేసింది. అయినా స‌రే.. ఎక్క‌డా త‌గ్గ‌కుండా అన్ని చోట్లా బానే మూవ్ అవుతోంది. ఇప్పుడు సిటీ ఇంకాస్త ఇంపార్టెంట్. ఇది అంద‌రి అడ్డా అనే ఫీలింగ్ ఉంటుంది. కాబ‌ట్టి.. గ్రేట‌ర్ ఎన్నిక‌ల‌పై టీడీపీ కూడా బానే ఫోక‌స్ చేసింది. లీడ‌ర్ల‌తో ప్లానింగ్ పై మాట్లాడారు.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు. ఎలాగైనా ఉనికి చాటుకోవాల‌ని.. వీలైన‌న్ని చోట్ల గెల‌వాల‌ని.. లోక‌ల్ గా స్ట్రాంగ్ గా ఉండి.. అధికార పార్టీ స‌పోర్ట్ లేని లీడ‌ర్ల‌ని దించాల‌ని చూస్తోంది టీడీపీ. బ‌లంగా ఉన్న లీడ‌ర్ల‌కి పార్టీ స‌పోర్ట్ ఇచ్చి.. గెలిపించాల‌ని ప్లాన్ చేస్తోందంట‌. సో.. మూడు పార్టీలు ఒకే ప్లాన్ లో ఉన్న‌య్.. ఉనికి చాటుకోక పోతే.. టీఆర్ఎస్, ఎంఐఎం ముందు నిల‌వ‌లేం అని.. గ‌ట్టిగానే పోటీ ఇవ్వాల‌ని చూస్తున్నార‌ట లీడ‌ర్లు.

Related Posts