తెరపైకి మళ్లీ జమలి ఎన్నికలు అంశం వచ్చింది. ఒకేసారి పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహిస్తే చిన్నా చితకా పార్టీలు కుదేలౌతాయనే స్ట్రేటజీ ఫాలో అవుదామని కసరత్తు మొదలు పెట్టేసింది. దక్షిణాఫ్రికా,బెల్జియం, స్వీడన్ వంటి దేశాల్లో ఈ తరహా నిర్వహించే ఎన్నికలను అధ్యయనం చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది కేంద్రం. ఈ ఏడాది జరగనున్న స్వీడన్ ఎన్నికలను నిశీతంగా పరిశీలించనుంది. ఇప్పటికే పలు దఫాలు ఈ తరహా ఎన్నికలపై బిజెపి సర్కార్ ప్రచారం మొదలు పెట్టింది. అయితే విభిన్న సంస్కృతులు, పరిస్థితులు వున్న భారత్ లో ఈ తరహా ఎన్నికలు కష్టసాధ్యమని నిపుణులు ఇప్పటికే తేల్చినా మోడీ సర్కార్ మాత్రం ఆ వైపే అడుగులు వేస్తుంది. కేంద్రం జమిలి ఎన్నికలకు వెళితే ఎపి, తెలంగాణాల రాష్ట్రాలకు ప్రాంతీయ పార్టీలకు మేలు జరుగుతుంది అంటున్నారు పరిశీలకులు. 2004 లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన చంద్రబాబు సర్కార్ కి చేదు అనుభవమే మిగిలింది. అలిపిరిలో చంద్రబాబు పై నక్సల్స్ బాంబు దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో సానుభూతి పవనాలు తనవైపు ఉంటాయన్న అంచనాతో బాబు ముందస్తుకు సాహసం చేసి పదేళ్ళపాటు అధికారానికి దూరం అయ్యారు. 2104 లో మోడీ సర్కార్ తో ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. ఇప్పుడు కూడా బాబు రెండు ఎన్నికలు ఒకేసారి రావాలని కోరుకుంటున్నారు. ఒకేసారి రెండు ఎన్నికలు ఎదుర్కోవడం వల్ల జాతీయ పార్టీల గురించి జనం ఆలోచించకుండా ఉంటారనేది చంద్రబాబు ఆలోచన. మరి ఏమి జరుగుతుందో చూడాలి.లోక్ సభకు ఒకసారి, అసెంబ్లీలకు మరోసారి ఎన్నికలు జరిగితే మాత్రం రెండిటి ఫలితాలు తేడా గా వుంటాయని చెబుతున్నారు. అభ్యర్థుల ఖర్చు, ప్రచారం భారీగా తగ్గుతాయని కూడా లెక్కలు వేస్తున్నారు. లోక్ సభ, అసెంబ్లీ సభ్యులు ఖర్చును సగం సగం పంచుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.