చిత్తూరు నవంబర్ 16,
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సప్త గోకులం పూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా ప్రారంభించారు. భక్తుల విరాళాలతో గోశాలను అభివృద్ధి చేస్తామని ఈవో పెద్దిరాజు పేర్కొన్నారు. ఆలయంలో సప్త గోవులను పూజించుకునే అవకాశాన్ని భక్తులకు కల్పించారు. కార్తీక సోమవారం సప్త గోపూజ ను ఆలయంలో ప్రారంభించారు. బి చాలా గాలి గోపురం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షెడ్ లో సప్త గోవులను నుంచి గోపూజలు శాస్త్రయుక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో వేద మంత్రాలతో గోపూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి శాసనసభ్యుడు సతీమణి వాణి పూజలో పాల్గొన్నారు. గో పూజ చేసి సప్త గోపూజకు శ్రీకారం చుట్టారు. సప్త గోపూజకు తొలుత శాసన సభ్యుని సతీమణి వాణి 10116 విరాళంగా అందించారు. ఆలయ ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ ఆలయానికి వచ్చే భక్తులకు ప్రతి నిత్యం పూజ చేసుకునే అవకాశం కల్పించనున్నారు ఈ పూజా కార్యక్రమానికి ప్రత్యేకంగా భక్తుల విరాళాలతో అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ పూజాది కార్యక్రమాల్లో ఆలయ ఏవో కృష్ణారెడ్డి, ఏ ఈ ఓ ధనపాల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్, స్థానిక వైసిపి నాయకులు వాసుదేవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.