YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఈసీ ఇవ్వకపోతే చెప్పండి

ఈసీ ఇవ్వకపోతే చెప్పండి

న్యూఢిల్లీ, నవంబర్ 16 
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికలపై ఇచ్చిన ఆదేశాలను సవరించాలన్న పిటిషన్‌పై ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి వాదనలు వినిపించారు. అభివృద్ధి పనుల ప్రారంభానికి.. ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలన్న ఆదేశాన్ని సవరించాలని కోరారు. దీనిపై స్పందించిన సీజే.. ఎన్నికల సంఘం అభివృద్ధి పనులను ఆపిందా అని ప్రశ్నించారు. కొత్తగా ఎన్నికల నిర్వహణపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని రోహత్గి అన్నారు.ఎన్నికల కోడ్ అమలులో లేనప్పుడు ప్రభుత్వం ఈసీ అనుమతి ఎలా తీసుకుంటుందని రోహత్గి ప్రశ్నించారు. ఈసీ తరపు న్యాయవాది మాట్లాడుతూ ఎన్నికలు రద్దు చేయలేదని, వాయిదా వేశామన్నారు. అయితే అభివృద్ధి పనులకు ఈసీకి దరఖాస్తు చేసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి సీజే సూచించారు. ఒకవేళ అనుమతి ఇవ్వకపోతే అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని సూచించారు.. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేశారు.

Related Posts