YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

టీడీపీ నేతలకు సిగ్గుందా?

టీడీపీ నేతలకు సిగ్గుందా?

అనంతపురం, నవంబర్‌ 16

అధికారంలో ఉండగా ప్రజలను పట్టించుకోని చంద్రబాబు ఐదేళ్ల టీడీపీ పాలన అవినీతి, అక్రమాలే జన్మభూమి కమిటీలు పెట్టి అడ్డగోలుగా దోపిడీ ఏనాడైనా జిల్లా రైతాంగాన్ని ఆదుకున్నారా? ఏటా 30 టీఎంసీలకు పైగా వచ్చినా ఒక్క ఎకరాకైనా నీళ్లిచ్చారా? ఎన్నికల ముందు ప్రాజెక్టుల పేరుతో ప్రచారం వాస్తవం కాదా? 18 నెలలుగా రాష్ట్రంలో సంక్షేమ పరిపాలన ,  వ్యవస్థలను అడ్డుపెట్టుకుని చంద్రబాబు కుట్ర రాజకీయాలు జగన్‌ సీఎంగా ఉన్నంతకాలం పోలవరం ఎత్తు ఒక్క ఇంచ్‌ కూడా తగ్గదు వేరుకుంపట్లు పెట్టుకుని ‘అనంత’ను భ్రష్టుపట్టించిన అప్పటి ప్రజాప్రతినిధులు నిర్మాణాలు పూర్తి కాని స్థలాలు చూపి ‘నా ఇల్లు–నా సొంతమా’? పాదయాత్ర ముగింపు సభలో ఎమ్మెల్యే అనంత ధ్వజం.

అధికారంలో ఉండగా ప్రజల గురించి ఆలోచించని చంద్రబాబు, టీడీపీ నేతలు.. ఇప్పుడు కుట్రలు, కుయుక్తులతో సీఎం జగన్‌ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి అన్నారు. టీడీపీ నేతలకు అసలు సిగ్గుందా? అని ప్రశ్నించారు. ఐదేళ్ల టీడీపీ పాలన అవినీతి, అక్రమాలేనని.. జన్మభూమి కమిటీలు పెట్టి దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌ చేపట్టిన ‘ప్రజా సంకల్ప పాదయాత్ర’కు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం 8, 9 , 10 డివిజన్లలో ఎంపీ తలారి రంగయ్యతో కలిసి పాదయాత్ర చేశారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పాతూరులోని బ్రహ్మంగారి గుడి వద్ద ఏర్పాటు చేసిన సభలో అనంత ప్రసంగించారు.  ఆయన ఏమన్నారంటే..‘‘ తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ సంక్షేమ పథకం చూసినా అవినీతే. ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారు. అలాంటి సమయంలో ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేశారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 14 నెలలు 3648 కిలోమీటర్లు నడిచారు. ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని మేనిఫెస్టోగా మలిచారు. ప్రజల ఆశీర్వాదంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక 18 నెలలుగా జనరంజక పాలన అందిస్తున్నారు. సంక్షేమ పథకాలు అందించే విషయంలో పూర్తి పారదర్శకత పాటిస్తున్నాం. తండ్రి వైఎస్‌ కంటే రెండు అడుగులు ముందుకేసి జగన్‌ పరిపాలిస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇన్ని సంక్షేమ పథకాలు అందడం లేదు. 18 నెలలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.52 వేల కోట్లు సంక్షేమానికి వెచ్చించాం. అనంతపురంలో 18 నెలల్లో 53 కోట్లు అందించాం. ప్రతి నెలా పింఛన్ల కోసం రూ.7 కోట్లు అందజేస్తున్నాం. మేం మాటలకు పరిమితం కావడం లేదు. చేతల్లో చూపిస్తున్నాం. ఎన్నికల సమయంలో ఓట్లు అడగడానికే కాదు.. అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకునేందుకే ఇంటింటికీ వెళ్తున్నాం. ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారు. సాంకేతిక కారణాలతో కొందరికి పథకాలు అందడం లేదని మా దృష్టికి వచ్చింది. అక్కడికక్కడే పరిష్కార చర్యలు తీసుకున్నాం. మా బాధ్యత ఇంతటితో అయిపోలేదు. సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తాం. ఎవరూ అధైర్యపడొద్దు’’ అని అనంత చెప్పారు. ▪️నాటి ఎంపీ, ఎమ్మెల్యేలు సంపాదనకే పరిమితం ‘‘గత ప్రభుత్వంలో ఎంపీ, ఎమ్మెల్యేలు సంపాదనకే పరిమితం అయ్యారు. ఏ పనిలో లాభం ఉంటే ఆ పనులు మాత్రమే చేశారు. ప్రజల గురించి ఏనాడూ ఆలోచించలేదు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఐదేళ్లు అభివృద్ధి లేదు. అప్పుడున్న ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌లు వేరుకుంపటి పెట్టుకుని నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించారు. ఒకరు రోడ్డు వెడల్పు చేయాలని, మరొకరు వెడల్పు వద్దని అన్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించకుండా ఆధిపత్య పోరుకే పరిమితం అయ్యారు. కానీ మేం ఈ 18 నెలల్లో అభివృద్ధి చేస్తున్నాం. సీఎం జగన్‌ ఆశీస్సులతో రూ.155 కోట్లను రోడ్లు, కాలువల కోసం వెచ్చిస్తున్నాం. గుత్తి రోడ్డు ఫోర్‌వే జనవరిలోగా పూర్తి చేస్తాం. రూ.60 కోట్లతో నగరంలో రోడ్లు వేయిస్తున్నాం. 2014 ఎన్నికల సమయంలో నగరానికి అండర్‌ గ్రౌండ్‌ డ్రెయినేజీ తెస్తామని ఆ తర్వాత తేలేదు. మేం ఎన్నికల్లో మాటిచ్చాం. త్వరలోనే అండర్‌ గ్రౌండ్‌ మంజూరవుతుంది. పంగల్‌ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్‌ వరకు రూ.310 కోట్లతో నాలుగు లైన్ల రహదారి నిర్మాణం చేపడతాం’’ అని ఎమ్మెల్యే అనంత తెలిపారు. ▪️జిల్లా రైతాంగాన్ని ఏనాడైనా ఆదుకున్నారా? ‘‘వెనుకబడిన అనంతపురం జిల్లాలో రైతాంగాన్ని ఏనాడైనా ఆదుకున్నారా? సీఎం హోదాలో చంద్రబాబు జిల్లాకు వస్తే కేవలం హామీలు ఇవ్వడం తప్పితే ఒక్కటైనా అమలు చేశారా? కృష్ణా జలాల కోసం గతంలో అన్ని పార్టీలు ఆందోళన చేశాయి. వైఎస్‌ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే హంద్రీనీవా ద్వారా కృష్ణాజలాలు తెచ్చారు. 3.50 లక్షల ఎకరాలకు నీరు అందించాలని సంకల్పించారు. వైఎస్‌ కారణంగానే 2012 నుంచి జిల్లాకు కృష్ణా జలాలు వస్తున్నాయి. 2014లో చంద్రబాబు సీఎం అయ్యాక ఏటా 30 టీఎంసీలకు పైగా నీళ్లు జిల్లాకు వచ్చాయి. ఒక్క ఎకరాకు నీళ్లిచ్చిన పాపాన పోలేదు. తీరా 2019 ఎన్నికల ముందు బీటీపీ, పేరూరు ప్రాజెక్టుల పేరుతో మోసం చేశారు’’ అని అనంత ధ్వజమెత్తారు. ▪️ఇంటికో ఉద్యోగం ఇవ్వలేదే? ‘‘నేను ముఖ్యమంత్రి అవగానే ఇంటికో ఉద్యోగం ఇస్తానని చంద్రబాబు అన్నారు. ఐదేళ్లు పరిపాలన చేసి ఇవ్వలేకపోయారు. కానీ జగన్‌ మాత్రం సచివాలయ వ్యవస్థను తెచ్చి ఏకంగా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించేలా చట్టం తెచ్చిన ఘనత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిది’’ అని అనంత అన్నారు. ▪️పోలవరం ఎత్తు ఇంచు కూడా తగ్గదు ఏపీకి జీవనాడి అయిన పోలవరంపై చంద్రబాబు, టీడీపీ నేతలు, కొన్ని మీడియాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి అన్నారు. అధికారంలో ఉండగా పోలవరంను కమీషన్లకు కక్కుర్తి పడి నిర్లక్ష్యం చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. పోలవరంను ఏటీఎంగా మార్చుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు హయాంలోనే 70 శాతం పనులు పూర్తయ్యాయని నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారన్నారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. పోలవరం పనులు వేగంగా జరుగుతుంటే చంద్రబాబు, టీడీపీ నేతలు సైంధవుల్లా అడ్డుపడుతున్నారని అన్నారు. తన అనుచరగణం సుజనా చౌదరి, సీఎం రమేశ్‌ లాంటి వాళ్లను బీజేపీలో చేర్చి కేంద్రం నుంచి నిధులు రాకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌ సీఎంగా ఉన్నన్నాళ్లూ పోలవరం ప్రాజెక్ట్‌ ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గదని స్పష్టం చేశారు. 2021 డిసెంబర్‌ నాటికి పోలవరంను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పూర్తి చేస్తారన్నారు. చంద్రబాబుది వెన్నుపోటు చరిత్ర పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని ఎమ్మెల్యే అనంత అన్నారు. అలాంటి మనస్తత్వాన్నే ఇప్పటికీ కొనసాగిస్తున్న చంద్రబాబు.. ప్రజలకు మంచి చేయాలని జగన్‌ చూస్తుంటే కుట్రలు, కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. తాను అధికారంలో ఉండగా అనేక వ్యవస్థలోకి తన మనషుల్ని  చంద్రబాబు పెట్టుకున్నారన్నారు. ఇప్పుడు వాళ్లను అడ్డుపెట్టుకుని ప్రభుత్వానికి అడ్డంకులు సృష్టిస్తున్నారన్నారు. ప్రజల కోసం పరితపించే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను రాజకీయంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ▪️సిగ్గులేకుండా ‘నా ఇల్లు–నా  సొంతమా’? పేద ప్రజల సొంతింటి కలను త్వరలోనే సాకారం చేస్తామని ఎమ్మెల్యే అనంత తెలిపారు. ఇప్పటికే లాటరీ ద్వారా లబ్ధిదారుల ఎంపిక జరిగిందని, ప్లాట్లు కూడా వేసినట్లు తెలిపారు. అనంతపురం నియోజకవర్గంలో 23 వేల మందికి పట్టాలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ఇలాంటి తరుణంలో టీడీపీ నేతలు ప్రవర్తిస్తున్న తీరుపై ఎమ్మెల్యే అనంత మండిపడ్డారు. ‘‘టిడ్కో పేరుతో ఆనాడు 4200 మందితో డీడీలు కట్టించుకున్నారు. కనీసం ఒక్క ఇళ్లయినా పూర్తి చేశారా? పిల్లర్లు, పునాదులకే పరిమితం చేశారే..! నిర్మాణాలు కూడా పూర్తి చేయలేదు. కానీ సిగ్గులేకుండా ఈ రోజు ‘నా ఇల్లు–నా సొంతం’ అంటారా? దానికి ఒక వామపక్ష పార్టీ తోకపట్టుకుని వెళ్తోంది..! అధికారం ఇవ్వలేదన్న అక్కసుతో టీడీపీ నేతలే స్టేలు తెచ్చి పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ జరగకుండా చేస్తున్నారు. మీకు నిజంగా ప్రజల పట్ల కృతజ్ఞతాభావం ఉంటే కేసులు వెనక్కుతీసుకోమని చంద్రబాబుకు చెప్పండి. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రజల్లోకి వెళితే ఇదే విషయాన్ని జనం అడిగితే ఏం జవాబు చెబుతారు?’’ అని నిలదీశారు. 

Related Posts