YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ఒకేసారి అంతరీక్షంలోకి నలుగురు వ్యోమగాములు

ఒకేసారి అంతరీక్షంలోకి నలుగురు వ్యోమగాములు

న్యూ ఢిల్లీ నవంబర్ 16

ఒకేసారి అంతరీక్షంలోకి నలుగురు వ్యోమగాములు 64 రోజులపాటు అక్కడే ఉండనున్న వ్యోమగాములు స్పేస్ –ఎక్స్ తో కలిసి నాసాతో సాహసం గతంలో ఎన్నడూ లేని విధంగా నలుగురు వ్యోమగాములు ఒకేసారి అంతరీక్షంలోకి వెళ్లారు. అక్కడే 64 రోజులపాటు ఉండనున్నారు. ప్రముఖ రాకెట్ తయారీ సంస్థ స్పేస్ -ఎక్స్ నాసాతో కలిసి ఈ సాహసం చేసింది. స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి 7 గంటల 27 నిమిషాలకు స్పేస్ ఎక్స్ బృందం ఫాల్కన్ 9 రాకెట్లో అంతరిక్షంలోకి బయలుదేరింది. వ్యోమగాముల్లో మైక్ హాప్కిన్స్ - విక్టర్ గ్లోవర్ - షానన్ వాకర్ తో పాటు జపాన్ వ్యోమగామి సోయిచి నొగుచి ఉన్నారు. వీరంతా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ల్యాండ్ కానున్నారు. ఇటువంటి ఆవిష్కరణ జరగడం ప్రపంచంలో ఇదే తొలిసారి. స్పేస్ ఎక్స్-నాసాతో కలిసి ఈ ఆపరేషన్ ను నిర్వహించింది. ఇప్పటికే అమెరికా రెండుసార్లు వ్యోమగాములను అంతరీక్షంలోకి పంపించింది. 2011లో స్పేస్ షటిల్ ప్రోగ్రామ్ తర్వాత మళ్లీ ఇదే తొలిసారి కావడం విశేషం. ఇక తొలిసారిగా పరీక్షలో భాగంగా డాగ్ హర్లే - బాబ్ బెహెన్ కెన్ లను ఈ ఏడాది మే నెలలో స్పేస్ స్టేషన్ కు నాసా పంపింది. అక్కడ వారు 63 రోజులు పాటు ఉండి ఆ తర్వాత ఆగష్టులో గల్ఫ్ ఆఫ్ మెక్సికో ప్రాంతంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యారు.  కెనెడీ స్పేస్ సెంటర్ వేదికగా నాసా-స్పేస్ ఎక్స్ ఈ రాకెట్ ను నింగిలోకి పంపాయి. ఇదిలా ఉంటే తొలిసారిగా ఒక వాణిజ్య సంస్థగా ఉండి అంతరిక్షంలోకి వ్యోమగాములను పంపిన సంస్థగా స్పేస్ ఎక్స్ సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇక ఈ ప్రయోగం సక్సెస్ తో 2024 కల్లా చంద్రుడిపై మానవుడిని పంపాలని ఆ తర్వాత అంగారకుడిపై కూడా మనిషిని పంపాలన్న యోచనతో నాసా ఉంది. ఇక చివరిసారిగా చంద్రుడిపై మనిషి 1972లో అడుగు పెట్టాడు.ఈ రోజు జరిగిన ప్రయోగంతో త్వరలోనే అనుకున్న లక్ష్యాలను అందుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు నాసా అడ్మినిస్ట్రేటర్ బ్రిడెన్ స్టైన్. ఇక స్పేస్ స్టేషన్ లో అడుగు పెట్టకముందు 27గంటల పాటు ఈ వ్యోమగాములు అంతరిక్షంలో సమయం గడుపుతారు. స్థానిక కాలమాన ప్రకారం సోమవారం రాత్రి 11 గంటలకు వీరు ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో ల్యాండ్ అవుతారు. అక్కడ ఆరు నెలల పాటు ఉంటారు. స్పేస్ స్టేషన్ లో ఇప్పటికే ఉన్న వ్యోమగాములు కేట్ రూబిన్స్ - సెర్జీ రిజికోవ్ - సెర్జీ కుద్-స్వెర్కోవ్ లను జాయిన్ అవుతారు. వీరంతా అక్టోబర్ నెలలో సోయుజ్ ఎంఎస్-17 స్పేస్ క్రాఫ్ట్ ద్వారా స్పేస్  స్టేషన్ కు చేరుకున్నారు. 

Related Posts