YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

డిసెంబర్ 1 న జీహెచ్ఎంసీ ఎన్నికలు కరోనా నిబంధనలు అమలు

డిసెంబర్ 1 న జీహెచ్ఎంసీ ఎన్నికలు కరోనా నిబంధనలు అమలు

హైదరాబాద్ నవంబర్ 17, 
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి మంగళవరం నాడు మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ  ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉంది.  హైదరాబాద్ లో నివసించాలని దేశవ్యాప్త ప్రజలు కోరుకుంటారు.  నాలుగు కేటగిరీలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నామని అన్నారు.  డీలిమిటేషన్ ఈ ఎన్నికలకు లేదు..రిజర్వేషన్లు 2016 వే కంటిన్యూ అవుతున్నాయి.  150 వార్డులకు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లిస్ట్ ద్వారా మ్యాపింగ్ చేసాం.  మేము, జీహెచ్ఎంసీ  రాజకీయ పార్టీలతో భేటీ అయ్యాకే తుది ఓటర్లను విడుదల చేసామని అయన అన్నారు.  ఎన్నికల బందోబస్తుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.  150 వార్డుల్లో కౌంటింగ్ కేంద్రాలు- స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ బాక్స్ ద్వారానే  జరుగుతాయి.  వైట్ పేపర్ ద్వారా పేపర్ ఉంటది.  మేయర్ పదవి  మహిళా  జనరల్ గా ఈ సారి ఉంటుంది.  పోలింగ్ స్టేషన్స్ పై 21నవంబర్ నాడు విడుదల చేస్తారు. బుధవారం నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు అవుతోంది. 18, 19, 20వ తేదీ వరకు నామినేషన్ చివరి ప్రక్రియ వుంటుంది. 21వ తేదీన నామినేషన్ స్కూటీని చేయడం జరుగుతుంది. 22వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. 22వ తేదీన మధ్యాహ్నం 3తరువాత అభ్యర్థుల ప్రకటన- సింబల్స్ అలాట్మెంట్ ఉంటుంది. డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ పోలింగ్ వుంటుంది. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ సమయం. ఏదైనా జరిగితే రిపోలింగ్ 3వతేదీన నిర్వహిస్తామని అయన అన్నారు. కౌంటింగ్ 4వ తేదీన నిర్వహిస్తాం. ఉదయం 7గంటల నుంచి స్టార్ట్ చేస్తాం. ఫలితాలు 4వ తేదీ డిసెంబర్ సాయంత్రం వరకు ముగుస్తుంది అనుకుంటున్నా. ఎస్సీ, ఎస్టీ, బీసీ  అభ్యర్థులకు 2500, ఇతరులకు 5000 రూపాయలు డిపాజిట్ చేయాలి. నామినేషన్ ప్రక్రియలో ఫామ్ వెరిఫికేషన్ ఆన్లైన్ లో చూసుకోవచ్చు. కరొనా వల్ల 1+3 పోలింగ్ సిబ్బంది ఉంటారని అయన అన్నారు. మొత్తం  48వేల మందితో ఈ ఎన్నికల నిర్వహణ ఉంటుంది.  9238 మొత్తం పోలింగ్ స్టేషన్స్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో ఉండేవి.  21వ తేదీ నవంబర్ నాడు ఫైనల్ చేస్తాం.  1439 సెంటిస్టివ్, హైపర్ సెంటిటివ్ 1004, క్రిటికల్ 257,మొత్తం 27వందల పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి.  913 సమస్యాత్మక పోలింగ్  ప్రాంతాలను ఇప్పటి వరకు గుర్తించాం.  ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయిని అయన హెచ్చరించారు.
 ఫలితాలు విడుదల అయిన తరువాత 45 రోజుల్లో అకౌంట్స్ చూపించాలి. అప్పటిలోగా నిర్లక్ష్యం వహిస్తే 3సంవత్సరాలు డిస్క్వాలిపై చేస్తాం.  జనరల్ పర్యవేక్షణ కోసం ఒక్కో జోన్ కు ఐయేఎస్అధికారి మొత్తం ఆరుగురు నియమిస్తాం.  ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఇద్దరు పోలీసులు బందోబస్తు--25వేలనుంచి 30వేల మంది పోలీసుల బందోబస్తు వుంటుంది.   ఎన్నికల నిర్వహణ కోసం అక్కడక్కడా చెక్ పోస్ట్ లను పేడతారు.  356 రూట్ మొబైల్ పార్టిస్, 131 స్ట్రైకింగ్ పోర్స్, 44 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బందోబస్తు వుంటుంది.  పోలింగ్ కు 48 గంటల ముందు మద్యం బ్యాన్ చేయబడతాయి. ఎన్నికల్లో ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్ అందిస్తారు. 

Related Posts