విజయనగరం నవంబర్ 17,
గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ ను మా తండ్రి పివిజి రాజు ఏర్పాటుచేశారు. చట్టవిరుద్ధంగా, అర్ధరాత్రి జీవోలు ఇచ్చి సహజ న్యాయసూత్రాలకు విరుద్ధ0గా టెంపుల్స్ ఛైర్మన్ గా ఉన్న నన్ను తొలగించారు. కనీసం ఎలాంటి నోటీస్ ఇవ్వలేదని మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. ఛైర్మన్ పోస్ట్ అపాయింటింగ్ పోస్ట్ కాదు, ఆనవాయితీగా వచ్చే పోస్ట్. ఇప్పుడు కనీస న్యాయసూత్రం పాటించటం లేదు. నేను చైర్మన్ గా ఉన్న సమయంలో 37 దేవాలయాల్లో ధూప దీప నైవేద్యాలు జరగటం లేదు. అన్ని దేవాలయాల్లో పూజలు జరిగేలా చర్యలు చేపట్టాం, ఇప్పటికి ఇంకా రెండు దేవాలయాల్లో పూజలు జరగటం లేదని అన్నారు. 105 దేవాలయాలను ఆరు గ్రూప్స్ గా దేవాలయాలుగా విభజించాం. కోర్టులో కేసులకు, ఆనవాయితీలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇష్టం వచ్చిన వారిని మీ కుటుంబసభ్యులు అంటున్నారు ప్రభుత్వ పెద్దలు. ఆనవాయితీలను పాటించాలని సుప్రీంకోర్టు కూడా చెబుతుంది. మొదట ఆదాయం ఉన్న ఆలయాల పై, తరువాత ఆస్తులు ఉన్న ఆలయాల పై, ఇప్పుడు అన్ని ఆలయాల పై పడుతున్నారు. మంత్రుల స్టేట్మెంట్ ఎవరికి అర్ధం కావట్లేదని అయన అన్నారు. మాది కుటుంబసమస్య కాదు, ఆలయాలు మా సొంతవి కావు, భక్తులవి. ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు మంచివి కావు. దేవాలయ నియామకాలు నిబంధనలు పాటించకుండా జరుగుతున్నాయి. సంచయిత 105 ఆలయాల్లో ఒక ఫెస్టివల్ కి కూడా హాజరవ్వలేదు. తండ్రి, తాతగారిని కూడా ఎప్పుడూ కలవలేదు. బొత్స పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు జగన్ పై సీబీఐ కేసు నమోదు అయ్యింది. బొత్స మంత్రిగా ఉన్నప్పుడు మాన్సస్ లో కొన్ని సవరణలు ఇచ్చారని అయన అన్నారు. సంచయిత పై అశోక్ గజపతి రాజు ఘాటుగా స్పందించారు.. చరిత్రలో తండ్రులు మార్చేవారు ఎవరైనా ఉన్నారా ? సోషల్ మీడియాలో మీ తండ్రి ఎవరో మీరే పోస్ట్ చేశారు. మీరు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు మీ వ్యవహారశైలి ఎలాంటిదో చెబుతుంది. ఎవరో పెట్టిన పనికిమాలిన పోస్టులకు నేను సమాధానం చెప్పాల్సి రావటం నా కర్మ. ప్రధాని మోడీ తో పనిచేయటం నా అదృష్టం. భారతదేశం తరుపున విదేశాల ప్రతినిధులతో మాట్లాడే అవకాశం లభించింది. ఎయిర్ ఫోర్స్ ను వేగంగా దూసుకెళ్లేలా మోడీ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు తెచ్చామని అయన అన్నారు. మోడీ ప్రభుత్వంలో కేంద్రమంత్రిగా అనేక మధురస్మృతులు ఉన్నాయి. టిడిపి పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలోనే పనిచేశాను, కోతిగంతులు వేయలేదు, వేయను. విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నాను. కరోనా నిబంధనలు అని ప్రభుత్వం అంటుంది, పాదయాత్రలో ఆ నిబంధనలు లేవా ? కరోనా ఉందని ఎన్నికలు జరపొద్దని ప్రభుత్వం అంటుంది, పాదయాత్రలో వేలాది మందితో సమావేశాలకు కరోనా రాదా అని అయన ప్రశ్నించారు.