ఏలూరు నవంబర్ 17
ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అధికారులతో కలిసి స్పిల్‌వే పనులు పరిశీలించారు. ఇటీవల పోలవరం ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున వచ్చిన విమర్శల నేపథ్యంలో మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలవరం జాతీయ ప్రాజెక్టు అని, పోలవరానికి నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదేనని అన్నారు.పోలవరం ఎత్తు తగ్గిస్తామని ఆరోపణలు చేస్తున్నారని, అది అవాస్తవమని మంత్రి అనిల్ అన్నారు. మేం జనాల్లో ఉంటాం, మీలా జూమ్‌లో మాట్లాడమని అన్నారు. రూ.55 వేల కోట్ల ప్రాజెక్ట్‌లో రూ.17 వేల కోట్లు 70 శాతం ఎలా అవుతుందని ప్రశ్నించారు. 2021 ఖరీఫ్ నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం నీళ్లు ఇస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు.