YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం

గులాబీ వ్యూహాలు... గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ లీడర్ల మొహరింపు

గులాబీ వ్యూహాలు... గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ లీడర్ల మొహరింపు

రంగంలోకి 17 మంది మంత్రులు  85 మంది ఎమ్మెల్యేలు, 9 మందిలోకసభ సభ్యులు 5 గురు రాజ్యసభ సభ్యులు, 
గ్రేటర్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా టీఆర్ ఎస్ వ్యూహాలు రచిస్తోంది.  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ లీడర్లందరినీ గ్రేటర్ ఎన్నికల్లో మోహరించాలని డిసైడ్ అయింది. సీఎం కేసీఆర్ మినహా 17 మంది మంత్రులు, 85 మంది ఎమ్మెల్యేలు, 9 మంది లోక్సభ సభ్యులు, ఐదుగురు రాజ్యసభ సభ్యులు, 32 మంది ఎమ్మెల్సీలకు ఎన్నికల బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. వీరంతా  జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూలు విడుదలైన మరుక్షణం నుంచే ఎన్నికల ప్రచారంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.ఎన్నికల కోసం గ్రేటర్లోని నియోజకవర్గానికి ఓ మంత్రిని, డివిజన్ కు ఓ ఎమ్మెల్యేను నియమించినట్లు టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఎవరు ఏ నియోజకవర్గం, ఏ డివిజన్  లో ఎన్నికల బాధ్యతలు చూడాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్  దిశానిర్దేశం చేస్తున్నారు. వారంతా తమకు అప్పగించిన నియోజకవర్గం, డివిజన్ నేతలతో మీటింగ్లు పెట్టుకుంటున్నారు. లోకల్ ఎమ్మెల్యే  కో ఆర్డినేషన్ తో స్థానిక పరిస్థితులను ఆరా తీస్తున్నారు. బీజేపీ బలం ఏ మేరకు ఉందని, ఆ బలాన్ని ఎదుర్కొనేందుకు ఏం చేయాలని అడిగి తెలుసుకుంటున్నారు.భవిష్యత్ అవసరాల మేరకు మంత్రులు, ఎమ్మెల్యేలకు డివిజన్ల బాధ్యతలను తగ్గించడమో, పెంచడమో చేయనున్నట్టు తెలిసింది.. సిటీలో 24 నియోజకవర్గాలు ఉన్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు,ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు , గ్రేటర్ చుట్టున్న మేయర్లు , కార్పొరేషన్ చైర్మన్లు అందరూ జీహెచ్ ఎంసీ ఎన్నికలు ముగిసే వరకు హైదరాబాద్ నుంచి ఎటు వెళ్లొద్దని టీఆర్ఎస్ పెద్దలు ఆదేశించినట్టు తెలిసింది.
 ఎల్బీనగర్ - జగదీశ్, సబిత, ఎర్రబెల్లి -
ఉప్పల్  సత్యవతి, జగదీశ్,  
మల్కాజ్గిరి - ఈటల రాజేందర్, కొప్పుల, మల్లారెడ్డి,
కుత్బుల్లాపూర్   ప్రశాంత్ రెడ్డి,
పటాన్ చెరు - హరీశ్ రావు
,ఖైరతాబాద్ ఇంద్రకరణ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి
జూబ్లీహిల్స్  గంగుల కమలాకర్,
కూకట్ పల్లి  పువ్వాడ అజయ్
సనత్ నగర్ - తలసాని శ్రీనివాస్ యాదవ్,
ముషీరాబాద్ =-శ్రీనివాస్ గౌడ్,
రాజేంద్రనగర్ - మహమూద్ అలీ

Related Posts