YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

జీహెచ్ ఎంసీ రేసులో వారసులు

జీహెచ్ ఎంసీ రేసులో వారసులు

హైద్రాబాద్, నవంబర్ 18, 
రాష్ట్రంలో దుబ్బాక ఉప ఎన్నికల హడావుడి ముగిసి పక్షం రోజులు గడవక ముందే మళ్లీ ఆ తరహా సందడి మొదలైపోయింది. ఈసారి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ ఎన్నికలకు నగరా మోగింది. దీంతో ప్రధాన రాజకీయ పక్షాలు ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని ఎవరికి వారు వ్యూహాలు రచించుకుంటున్నాయి. అత్యధిక కౌన్సిలర్ స్థానాలు గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ పోటీలో ముందంజలో టీఆర్ఎస్ ఉన్నప్పటికీ, దుబ్బాక విజయంతో బీజేపీ కూడా మేయర్ సీటుపై కన్నేసింది. ఇక గత కొన్నేళ్లుగా వరుస పరాజయాలతో దిగాలుపడ్డ కాంగ్రెస్ పార్టీ.. ఎలాగైనా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గౌరవప్రదమైన సంఖ్యను దక్కించుకోవాలని కసరత్తు చేస్తోంది.ఈసారి హైదరాబాద్ మేయర్ పదవిని జనరల్ కేటగిరీలో మహిళకు కేటాయించారు. టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పొత్తుతో మెజారిటీ స్థానాలు గెల్చుకొని మేయర్ సీటు దక్కించుకొనే అవకాశాలే అత్యధికంగా ఉండడంతో ఇక అధికార పార్టీ నేతల్లో ఆశలు మొదలయ్యాయి. ముఖ్యంగా టీఆర్ఎస్‌లో హైదరాబాద్‌కు చెందిన సీనియర్ నేతలు.. మేయర్ పదవి తమ కుటుంబానికే రావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. నగరానికి చెందిన ముఖ్య నేతలంతా తమ భార్య లేదా కోడలు వారూ కుదరకపోతే కూతుళ్లకు మేయర్ సీటు దక్కేలా ఇప్పటి నుంచే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు.మేయర్ పోస్టు జనరల్ కేటగిరీ మహిళకు కేటాయించడంతో హైదరాబాద్ మేయర్ రేసులో పలువురు ఉన్నారు. ఈ నేతలంతా తమ భార్య, కుమార్తె లేదా కోడల్ని మేయర్ సీటెక్కించాలని అప్పుడే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ రేసులో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోడలు, మంత్రి మల్లారెడ్డి కూతురు, ఎంపీ కేకే కూతురు విజయలక్ష్మి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు కోడలు, పి.జనార్దన్ రెడ్డి కూతురు విజయ, బొంతు రామ్మోహన్ భార్య, మంత్రి సబిత ఇంద్రారెడ్డి కోడలు ఉన్నారు.

Related Posts