YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కల్లు తాగితే ఖల్లాస్..

కల్లు తాగితే ఖల్లాస్..

అధికారుల నిర్లక్ష్యం, అక్రమ వ్యాపారుల ఇష్టారాజ్యం వెర సీ కల్తీ కల్లు కాటుకు బలవుతున్న అమాయకులు. అసలు ఉత్పత్తి అవుతున్న కల్లు కంటే కృత్రిమ తయారవుతున్న కల్లే అధికంగా ఉం డటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మారుమూల గ్రా మాల్లో కల్తీ కల్లు అంతగా తయారి చేసుకున్నప్పటికీ అంతర్గత రహదారులు, జాతీయ రహదారులు, పట్టణాలకు సమీపంగా ఉన్న కల్లు అడ్డాలు కల్తీ కల్లుకు కేంద్రాలుగా మారిపోతున్నాయి. గుడుంబా రహిత జిల్లాగా మార్చామని పదే పదే చెప్పుకునే ఎక్సైజ్‌ శాఖ ఓ వైపు గుడుంబాను నియంత్రించకపోగా ఇంకో వైపు కల్తీ కల్లు అమాయకుల ప్రాణాలతో ఆటలాడుకుంటుంది. గుర్రంపోడు మండలం పోచంపల్లి గ్రామంలో కల్తీ కల్లుకు పలువురు అనారోగ్యం పాలయ్యారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఇంత పెద్దఎత్తున కల్లీ కల్తు తయారవుతున్నప్పటికీ సం బంధిత శాఖ అధికారులు ఏం చేస్తున్నారన ప్రశ్న తలెత్తుతుంది. మాముళ్ల మత్తులో జోగుతున్న సిబ్బంది అక్రమ వ్యాపారులకు కొమ్ముగాస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్సైజ్‌శాఖ కొందరు అధికారులు, సిబ్బంది గ్రా మీణ ప్రాంతాల్లో తయారవుతున్న కృత్రిమ క ల్లు విషయం తెలిసి వారిచ్చే మామూళ్ల చూసీ చూడనట్లు వ్యవహరిస్తుండటంతో అమాయకుల ప్రాణాలు ప్రశ్నర్థకంగా మారుతున్నాయి.

వాస్తవానికైతే గుడుంబాతోపాటు కల్లుపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాల్సిన బాధ్యత ఎక్సై జ్‌ శాఖదే. ఏదైన ప్రమాదం జరిగినప్పుడు హ డావుడి చేయడం వల్ల ఎక్సైజ్‌ శాఖ నిరంతరం స్పందించిన దాఖలాలు తక్కువ అని చెప్పవచ్చు. కల్తీ అమ్మకాలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుండగా అది గీత కార్మికులకు ప్రయోజనం చేకూర్చడం లేదు. గీత వృత్తికి సంబంధం లేని వారు ఈ వ్యవస్థలో చేరి అక్రమ సంపాదనను పోగు చేసుకోవడం కల్లు అడ్డాలను ఏర్పాటు చేసి కల్తీ కల్లును విక్రయిస్తున్నారు. కల్లు అడ్డాలకు వెళ్లి శాంఫిల్స్‌ను సేకరించి అందులో ఏమేమి కలిపారు, ఎంత మోతాదులో ఉంది అన్న విషయాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాల్సి ఉంటుంది. కాగా అధికారుల నిర్లక్ష్యం ప్రతి పట్టణ శివారులోని కల్లు అడ్డాలుగా విచ్చలవిడిగా వెలసి అక్రమార్జనకు మార్గాలవుతున్నాయి.

అధిక మోతాదుల్లో క్ల్లోరోఫాం, నల్లమందు, చక్రిన్‌ వంటి మత్తు పదార్థాలను నిషా కోసం కలుపుడుతుంటడం ప్రమాదానికి కారణమవుతోంది. దీని ఫలితంగా కళ్లు తిరగడం, తలనొప్పి, వాంతు లు అవుతాయి. అనంతరం మనిషి శరీరంలో నాడీ వ్యవస్థ దెబ్బతిని అపస్మారక స్థితిలోకి వె ళ్లే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నా రు. గత సంవత్సరం దేవరకొండ డివిజన్‌లోని నేరేడుగొమ్ము ప్రాంతంలో ముగ్గురు అస్వస్థత కు గురయ్యారు. దేవరకొండ ప్రాంతంలోని తా టికోల్‌, చందంపేటతోపాటు నేరేడుగొమ్ము, దే వరకొండ పట్టణ ప్రాంతంలో కూడా కల్తీ కల్లు జోరుగా సాగుతున్నట్టు సమాచారం. నల్లగొం డ పట్టణానికి శివారు ప్రాంతాల్లో కల్తీ కల్లు విక్రయాలు నడుస్తున్నట్లు తెలుస్తోంది.

కొంతమంది వలసపోయిన వారు అక్రమ వ్యాపారులతో కుమ్మక్కై కల్తీ కల్లు తయారిలో భాగస్వాములవుతున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీ, గుజరాత్‌ రాష్ట్రాల నుంచి ఈ మత్తు పదార్థాలు తీసుకొస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన కొందరు వ్యక్తులు సూరత్‌, ఒరిస్సా, చత్తీస్‌ఘడ్‌ ప్రాంతాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు కల్లు సీజన్లలో వెళ్లి అక్కడి గీత పని చేసి కల్లు విక్రయిస్తుంటారు. వెళ్లేటపుడు వారి వెంట మరి కొంత మందిని తీసుకెళ్లి సీజన్‌ ముగిసే వరకు అక్కడే ఉంటారు. ఈ క్రమంలో అధిక లాభం కోసం మత్తు పదార్థాలను డ్రమ్ములు, హౌజుల్లో నీరు నింపించి కల్తీ కల్లు తయారు చేస్తున్నారు. ఈ దందాతో వారు రెండు మూడు నెలల్లోనే రూ.3 నుంచి రూ.4లక్షలు ఆర్జిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. వారి వెంట వెళ్లిన వారు వచ్చేటప్పుడు మత్తు పదార్థాలు తీసుకు వచ్చి కల్తీ కల్లు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని పట్టణ శివారు ప్రాంతాల్లో అత్యధికంగా కల్లు తయారు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.

Related Posts