మైలవరం నవంబర్ 18,
మాజీ మంత్రి దేవినేని ఉమా నోరు తెరిస్తే తప్పుడు మాటలేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జక్కంపూడిలో ప్రజలు ప్రశ్నించినా ఆయనకు బుద్ధి రాలేదని ధ్వజమెత్తారు. ‘‘తప్పుడు కేసులు అంటూ పిచ్చిపట్టిన వాడిలా మాట్లాడుతున్నారు. ఎన్నికల ముందు నాతో సహా, నా తండ్రి మీద, నా ప్రచార రథం డ్రైవర్తో పాటు అనేక మందిపై తప్పుడు కేసులు, సస్పెక్ట్ షీట్లు పెట్టించింది నువ్వు కదా. పచ్చ చొక్కా సీఐ సూరిబాబును అడ్డం పెట్టుకుని నీవు చేసిన అరాచకాలు మైలవరం నియోజకవర్గ ప్రజలందరూ చూశారు. ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం. కానీ నీలా ఎక్కడైనా ఒక్క తప్పుడు కేసు పెట్టించిన దాఖలాలు లేవు.పోలవరం కాలువ మట్టి, గ్రావెల్, నీరు-చెట్టు, ఇసుక, మద్యం అన్నింటిలో దోపిడీకి పాల్పడ్డావు. 15 నెలల నా పాలన గురించి ప్రతి నిత్యం పనికి మాలిన పోస్టులు, పిచ్చి పట్టిన వాడిలా ప్రేలాపనలు చేస్తున్నావు. నీకు జక్కంపూడిలో సరైన సమాధానం చెప్పినా బుద్థి రాలేదని’’ ఆయన ధ్వజమెత్తారు.2024 ఎన్నికలే తనకు గీటురాయి అని, అభివృద్ధి చేసి చూపించి ప్రజల్లోకి వెళ్తానని వసంత కృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు. టీడీపీ పాలనలో జన్మభూమి కమిటీల మాదిరిగా కాకుండా తమ వాలంటీర్ల వ్యవస్థ పార్టీల రహితంగా ప్రజల కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రజలే అంతిమ నిర్ణేతలు అని ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.