విశాఖపట్నం నవంబర్ 18,
వైసీపీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలు చెయ్యడం లేదని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణుకుమార్రాజు అన్నారు.రాష్ట్రంలో పరిపాలనపై దృష్టి సారించకుండా రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ కూడా రాజకీయాలు చేస్తున్నాయని మడమ తిప్పనని, మాట తప్పనని చెప్పిన జగన్ ఏ విషయంలోను దానిని పాటించలేద న్నారు. ప్రతి పేదకు ఇల్లు ఇస్తానని చెప్పి, అధికారంలోకి వచ్చిన తర్వాత ఇళ్ల నిర్మాణంపై అసలు దృష్టే పెట్టలేదన్నారు. నిర్మాణం పూర్తయిన వాటిని కూడా లబ్ధిదారులకు ఇవ్వడం లేదన్నారు. పాదయాత్రలో ఆయన చెప్పిన మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రజలంతా...అలా ఎందుకు చేశామా? అని ఇప్పుడు బాధపడుతున్నారని, ఎక్కడికి వెళ్లినా ఈ విషయం తెలు స్తుందని పేర్కొన్నారు. ఆయన పాలనలో ఏ వర్గమూ సంతోషంగా లేదన్నారు.జీవీఎంసీ ఎన్నికలు పెడితే ఓటమి తప్పదని భయంతో ఎన్నికలు నిర్వహించడంలేదని అన్నారు. ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు రెండు కలసి గట్టి పోటీనిస్తాయని చెప్పారు.