YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

టార్గెట్ బెంగాల్

టార్గెట్ బెంగాల్

కోల్ కత్తా, నవంబర్ 19, 
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక బీజేపీ దృష్టంతా పశ్చిమ బెంగాల్ పైనే ఉంది. ఇక బీజేపీ అగ్రనేతలందరూ పశ్చిమ బెంగాల్ కు క్యూకట్టనున్నారు. ఇప్పటికే అమిత్ షా పశ్చిమ బెంగాల్ లో పర్యటించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో జరగనున్నాయి. అంటే ఇంకా ఐదు నెలలు మాత్రమే సమయం ఉంది. పశ్చిమ బెంగాల్ పై ఈసారి బీజేపీ ఆశలు ఎక్కువగా పెట్టుకుంది. ఖచ్చితంగా విజయం సాధిస్తామన్న ధీమాతో ఉంది.పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో సత్తా చాటాలని బీజేపీ సమాయత్తమవుతోంది. ఏడాది ముందు నుంచే బీజేపీ తన ప్రచారాన్ని ప్రారంభించిందనే చెప్పాలి. సోషల్ మీడియా ద్వారా ఇప్పటికే బీజేపీ పశ్చిమ బెంగాల్ లో దూసుకుపోతుంది. తృణమూల్ కాంగ్రెస్ ను నిలువరించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుంది. అమిత్ షా పర్యటనతో నేతల మధ్య ఉన్న విభేదాలను కూడా తొలగించి మరింత ముందుకు వెళ్లాలని పార్టీ అగ్రనాయకత్వం భావిస్తుంది.గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఊహించని విజయం సాధించడంతో మమత బెనర్జీ పోకడలు పడని నేతలు సయితం బీజేపీ గూటికి చేరిపోయారు. తృణమూల్ కాంగ్రెస్ లో ముఖ్యనేతగా ఉన్న ముకుల్ రాయ్ బీజేపీలో చేరడంతో పార్టీ బలం మరింత పెరిగిందని భావిస్తున్నారు. ముకుల్ రాయ్ కు పార్టీలో పదవి దక్కింది. దీంతో పశ్చిమ బెంగాల్ లో ముకుల్ రాయ్ బీజేపీ ముఖ్యనేతగా మారారు. మరికొందరు నేతలు కూడా పార్టీలోకి వచ్చే అవకాశముంది.తృణమూల్ కాంగ్రెస్ లో లోటుపాట్లు తెలిసిన ముకుల్ రాయ్ ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషించనున్నారు. బలాలు, బలహీనతలు తెలిసిన నేత కావడంతో బీజేపీ ఆయనకు కీలక బాధ్యతలను అప్పగించే అవకాశముంది. కాంగ్రెస్, కమ్యునిస్టులు బలహీనపడటం, పదేళ్లుగా మమత బెనర్జీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకత తమకు కలసి వస్తుందని కమలనాధులు భావిస్తున్నారు. మొత్తం మీద పశ్చిమ బెంగాల్ కు ఇక బీజేపీ నేతలు క్యూకట్టనున్నారు.

Related Posts