YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

కరోనా శీతాకాలం

కరోనా శీతాకాలం

న్యూఢిల్లీ, నవంబర్ 19, 
కరోనా వైరస్ ముప్పు ఇంకా పొంచి ఉంది. మరో మూడు నెలల పాటు ఈ వైరస్ వీడదని నిపుణలు హెచ్చరిస్తున్నారు. శీతాకాలం కావడంతో వైరస్ మరింత విస్తరించే అవకాశముందని చెబుతున్నారు. చలికాలం కావడంతో వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. భారత్ లో వైరస్ ప్రభావం మరో మూడు నెలలు ఎక్కువగా ఉంటుందన్న నిపుణుల హెచ్చరికతో ప్రభుత్వాలు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది.మార్చి నెలలో భారత్ లో కరోనా వైరస్ ప్రారంభమయింది. తొలి కేసు కేరళలో నమోదయింది. ప్రస్తుతం భారత్ లో కరోనా కేసులు 90 లక్షలకు దాటేశాయి. 130 కోట్ల మంది ఉన్న భారత్ వంటి దేశంలో కరోనా కట్టడిని చాలా వరకూ నియంత్రించారనే చెప్పాలి. భారత్ లో రికవరీ రేటు బాగా పెరుగుతుంది. మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతుంది. పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ను ఎత్తి వేయడంతో సాధారణజీవనం ప్రారంభమయింది.అయితే భారత్ కు సెకండ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే యూరప్ వంటి దేశాల్లో వైరస్ సెకండ్ వేవ్ స్టార్టయింది. అనేక దేశాల్లో ఇప్పటికే లాక్ డౌన్ ను తిరిగి విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది. యూరప్ లో లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ వంటి దేశాలు రెండో విడత లాక్ డౌన్ ను అమలు చేశాయి. సెకండ్ వేవ్ లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉంటుందని యూరప్ లో నమోదవుతున్న కేసుల సంఖ్యను చూస్తేనే తెలుస్తుంది.దీంతో భారత్ లో కూడా సెకండ్ వేవ్ టెన్షన్ మొదలయింది. ప్రస్తుతం భారత్ లో రోజుకు యాభై నుంచి నలభై వేల కరోనా కేసులు నమోదవుతున్నాయి. సెకండ్ వేవ్ స్టార్టయితే ఫస్ట్ వేవ్ కంటే దారుణంగా ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయంగా ఉంది. ప్రజలు పూర్తిగా అవగాహనతో మెలగాలని సూచిస్తున్నారు. మరోసారి లాక్ డౌన్ కు దారితీస్తే ఆర్థిక పరిస్థితులు కూడా దారుణంగా తయారయ్యే అవకాశముంది. శీతాకాలం, వరస పండగలు వైరస్ వ్యాప్తికి కారణమవుతాయన్న హెచ్చరికలు వస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

Related Posts