న్యూఢిల్లీ, నవంబర్ 19,
భారత సంతతి పౌరులు అంతర్జాతీయంగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. అనేక దేశాల్లో ఇప్పటికే ఉన్నత పదవులను పొందారు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో భారత సంతతి పౌరులు రాజకీయంగా ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా న్యూజిల్యాండ్ మంత్రివర్గంలో భారత సంతతి మహిళ ప్రియాంక రాధా కృష్ణన్ చోటు సంపాదించుకున్నారు. పర్ధాని జెసిండా ఆర్డెర్న్ కేబినెట్ లో సహాయ మంత్రి పదవిని ప్రియాంక రాధాకృష్ణన్ చేపట్టారు.ప్రియాంక రాధాకృష్ణన్ కేరళ కు చెందిన వారు. కేరళలలోని ఎర్నాకులంకు చెందిన ఉతర పరావూర్ కు చెందిన ప్రియాంక రాధాకృష్ణన్ ఉన్నత విద్య కోసం న్యూజిల్యాండ్ కు వెళ్లారు. అక్కడ డెవెలెప్ మెంట్ స్టడీస్ లో మాస్టర్ డిగ్రీ చేశారు. సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్నారు. కేరళ కావడంతో సహజంగానే ప్రియాంక రాధాకృష్ణన్ కు వామపక్ష భావాజాలం అబ్బింది. దీంతో ఆమె లేబర్ పార్టీకి చేరువయ్యారు.2017లో ప్రియాంక రాధాకృష్ణన్ తొలిసారి ఎన్నికల్లో పోటీ చేసి ఎంపీ అయ్యారు. ప్రియాంక రాధాకృష్ణన్ అక్కడే స్థిరపడి వివాహం చేసుకున్నారు. న్యూజిలాండ్ పౌరుడు రిచర్డ్ సన్ ను వివాహం చేసుకుననారు. ఆయన కూడా సామాజికకార్యకర్త కావడంతో ఇద్దరి అభిప్రాయాలు కలవడంతో ఒక్కటయ్యారు. స్వచ్ఛందసంస్థలో పనిచేస్తుండగా వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి తర్వాత పెళ్లికి దారితీసింది.ప్రియాంక రాధాకృష్ణన్ న్యూజిల్యాండ్ మంత్రివర్గంలో చోటు సంపాదించుకోవడంతో కేరళలోని అన్ని రాజకీయ పార్టీల నేతలు హర్హం వ్యక్తం చేశారు. 41 ఏళ్ల వయసులోనే ప్రియాంక రాధాకృష్ణన్ రాజకీయంగా ఎదగడం, ఇతర దేశంలో ముఖ్యమైన పాత్ర పోషించడం హర్షణీయమని పలువురు అభినందనలు తెలిపారు. లేబర్ పార్టీలో భవిష్యత్ లో ప్రియాంక రాధాకృష్ణన్ కీలకమైన నేతగా ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.