YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

కేంద్రంపై గులాబీ పోరాటం

కేంద్రంపై గులాబీ పోరాటం

హైద్రాబాద్, నవంబర్ 19, 
తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీని తక్కువగా అంచనా వేయకూడదని నిర్ణయించుకున్నారు. హఠాత్తుగా టీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించిన ఆయన… బీజేపీని ఎలా ఎదుర్కోవాలో అందరికీ చెప్పి పంపించారు. జాతీయ స్థాయి నుంచి స్థానిక స్థాయి వరకూ బీజేపీని ఎలా ఎదుర్కోవాలో ప్రణాళికను కూడా ప్రకటించారు. జాతీయస్థాయిలో డిసెంబర్ రెండో వారంలో బీజేపీ వ్యతిరేక పార్టీల సమావేశం నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. బీజేపీ ప్రభుత్వం పరిశ్రమలన్నింటినీ అమ్మేస్తోందని..కార్మికులందర్నీ రోడ్డున పడేస్తోందని.. వారందర్నీ ఆదుకోవాలంటే… బీజేపీపై దేశవ్యాప్త పోరాటం తప్పనిసరి అని కేసీఆర్ అన్నారు. డిసెంబర్ రెండోవారంలో తన ఆధ్వర్యంలో నిర్వహించబోయే బీజేపీ వ్యతిరేక పార్టీల సమావేశానికి మమతా బెనర్జీ, కుమారస్వామి, అఖిలేష్ యాదవ్, స్టాలిన్, మాయావతి హాజరవుతున్నారని ఎంపీలు,ఎమ్మెల్యేలకు కేసీఆర్ తెలిపారు. సమావేశం అసాంతం.. బీజేపీపై విరుచుకుపడిన కేసీఆర్..బీజేపీపై హైదరాబాద్‌ నుంచే యుద్ధం మొదలవుతుందని ప్రకటించారు. జీహెచ్ఎంసీ సర్వేలన్నీ అనుకూలంగా ఉన్నాయని 105 సీట్లు గెలుస్తామని భరోసా ఇచ్చారు. దుబ్బాక ఉప ఎన్నిక ఫలితాన్ని మైండ్ నుండి తీసేయాలని.. ఇన్నాళ్లు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గ్రేటర్‌లో చేసిన అభివృద్ధితో పాటు.. కరోనా, వరదల్లో వ్యవహరించిన తీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని కేసీఆర్‌ ప్రజాప్రతినిధులకు సూచించారు. బీజేపీ విమర్శలను ..అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలని.. సోషల్‌ మీడియాతో సహా అన్ని వేదికలపై కౌంటర్లు ఇవ్వాలని కేసీఆర్ అందరికీ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో కేసీఆర్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. వరద సాయం పంపిణీకి ఈసీ బ్రేక్ వేసింది బీజేపీ చేసిన ఫిర్యాదు వల్లనేనని ఆరోపించారు. బండి సంజయ్.. లేఖ రాయడం వల్లనే… ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకున్నారని కేసీఆర్ మండిపడ్డారు. పేదల పొట్ట కొట్టారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలపై బండి సంజయ్ మండిపడ్డారు. తాను ఎలాంటి లేఖ రాయలేదని… తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిజమైన హిందువే అయితే.. తాను లేఖ రాసినట్లుగా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలన్నారు. మొత్తానికి కేసీఆర్ బీజేపీని ప్రధాన ప్రత్యర్థిగా చేసుకుని పోరాటం ప్రారంభించేశారు.

Related Posts