YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

నిమ్మగడ్డ హింటా...వార్నింగా...

నిమ్మగడ్డ హింటా...వార్నింగా...

విజయవాడ, నవంబర్ 19,
నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమయినట్లే కన్పిస్తుంది. ఆయన ఒకరకంగా ప్రభుత్వానికి హింట్ తో పాటు వార్నింగ్ కూడా ఇస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి నెలలో ఎన్నికలు జరపాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ దాదాపుగా నిర్ణయించారు. అంటే ఆయన ఎన్నికలకు వెళ్లాలనే గట్టిగా నిర్ణయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నో చెప్పినా ఆయన ఫిబ్రవరి నెలలో ఎన్నికలకు వెళ్లేందుకు దాదాపుగా సిద్ధమయ్యారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం వచ్చే మార్చినెలతో ముగుస్తుంది. అంటే తాను పదవి నుంచి వైదొలగక ముందే ఏపీలో స్ధానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని భావిస్తున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ చంద్రబాబు హయాంలో ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. ఆయన ఎన్నికల కమిషనర్ గా ఉన్నప్పటి నుంచి ఎటువంటి ఎన్నికలు ఏపీలో జరగలేదు. అయితే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించారు. కరోనా కారణంగా వాయిదా వేశారు.నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఈసారి న్యాయపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో స్థానికసంస్థల ఎన్నికల విషయంలో సంప్రదించారు. కరోనా ఉధృతి గణనీయంగా తగ్గుతుండటం, పొరుగు రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరుగుతుండటం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు మరింత కలసి వచ్చేలా కన్పిస్తుంది. ఎన్నికల నిర్వహణ రాజ్యాంగ పరమైన అవసరమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెబుతున్నారు.అంతేకాకుండా అన్ని రాజకీయ పార్టీలతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై అభిప్రాయాలను తెలుసుకున్నారు. హైకోర్టు కూడా స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై ఎస్ఈసీని ప్రశ్నించగా అఫడవిట్ ను కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాఖలు చేశారు. తనకు ప్రభుత్వం సహకరించడం లేదని చెప్పారు. దీంతో ఫిబ్రవరి నెలలోనే స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి ఆయన మార్చిలో పదవీ విరమణ చేయాలని భావిస్తున్నారు. అయితే కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారా? లేక ఆగిపోయిన ప్రక్రియను తిరిగి ప్రారంభిస్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆలోచనకు ప్రభుత్వం ఎలా చెక్ పెట్టగలుగుతుందో చూడాలి.

Related Posts