YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

డైరక్ట్ ఫైటేనా

 డైరక్ట్ ఫైటేనా

తిరుపతి, నవంబర్ 19, (న్యూస్ పల్స్)
బీహార్ ఎన్నికలు ప్రధానంగా ఏపీ ప్రభుత్వంపై ప్రభావం చూపనున్నాయి. బీహార్ లో తన ఇమేజ్ మీదనే గెలవడంతో మోదీ సయితం ఏపీ ప్రభుత్వాన్ని పెద్దగా పట్టించుకోరన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వరసగా మిత్రులు దూరం అవుతుండటంతో బీజేపీ వైసీపీ విషయంలో నిన్నమొన్నటి వరకూ ఆచితూచి అడుగులు వేసింది. దక్షిణాదిన జగన్ వంటి నేతలు బయట నుంచి మద్దతు ఇస్తున్నా వారికి దూరం కాకూడదని కేంద్రం పెద్దలు భావించారు.కానీ బీహార్ ఎన్నికల తర్వాత ఏపీ రాజకీయాల్లో కూడా అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయంటున్నారు. ఇప్పటి వరకూ బీజీేపీ రాష్ట్ర నాయకత్వమే వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తుంది. ఇక పై కేంద్ర ప్రభుత్వం సయితం జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకునే వీలుందంటున్నారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో జగన్ కు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు తప్పవంటున్నారు.అలాగని ఇప్పటికిప్పుడు జగన్ కూడా బీజేపీని పూర్తిగా దూరం చేసుకుని ఏమీ చేయలేని పరిస్థితి. ప్రస్తుతం ఏపీ ఉన్న ఆర్థిక పరిస్థితికి కేంద్ర ప్రభుత్వంపై పూర్తిగా ఆధారపడాల్సి ఉంది. దీంతో బతిమాలో, బామాలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చుకోవడానికే జగన్ యత్నించాల్సి ఉంటుంది. దీంతో పాటు రాజకీయంగా కూడా బీజేపీ మరింత దూకూడు పెంచే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు బీజేపీ నేతలు ఇక వెనకాడకపోవచ్చు.రానున్న తిరుపతి ఉప ఎన్నికల్లో సయితం బీజేపీ తన అభ్యర్థిని దించుతుంది. అందులో భాగంగా మోదీ, అమిత్ షా వంటి వారు కూడా ప్రచారానికి తీసుకురావాలన్న ప్లాన్ లో రాష్ట్ర బీజేపీ నేతలున్నారు. మోదీ, అమిత్ షాలు ఇప్పటి వరకూ జగన్ ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేయలేదు. అయితే ఉప ఎన్నిక ప్రచారంలో అది కూడా జరగవచ్చునని అంటున్నారు. మొత్తం మీద ఇక బీజేపీ విసిరే ప్రతి ఛాలెంజ్ ను జగన్ ఎదుర్కొనాల్సి ఉంటుంది. అందుకు జగన్ సిద్ధమవ్వాల్సి ఉంటుంది.

Related Posts