YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తిరుపతిపై మారుతున్న వ్యూహాలు

తిరుపతిపై మారుతున్న వ్యూహాలు

గుంటూరు, నవంబర్ 19, 
జగన్ కి దూకుడు రాజకీయం చేయడమే తెలుసు. కేసీఆర్ కి దూకుడూ ఉంది. చాణక్యం కూడా ఉంది. ఇక అంగ బలం, అర్ధం బలం విషయంలో కూడా కేసీఆర్ సర్వ శక్తి సంపన్నుడు. ఆయనకు బలమైన అనుకూల మీడియా ఉంది. తన తరువాత వరసగా అటు పార్టీలో ప్రభుత్వంలో ఒక్కొక్క చోట‌ సైనాధ్యక్షుడిని పెట్టి ఉంచారు. కేసీఆర్ దూరాలోచన కూడా బహు గొప్పది. అలాంటి కేసీఆర్ ని ఏమీ కాకుండా సొంత గడ్డ మీద ఓడించేసి జబ్బలు చరుస్తోంది బీజేపీ. కేసీఆర్ వంటి నాలుగు దశాబ్దాల అనుభ‌వం ఉన్న నేత. ఆరేళ్ళ నుంచి సీఎం గా కొనసాగుతున్న నాయకుడి విషయంలోనే బీజేపీ బోల్తా కొట్టించింది అంటే కమలం గురించి చాలా ఎక్కువగానే ఆలోచించాల్సిందే మరి.ఏపీలో చూసుకుంటే అంతా జగన్ మయం. పార్టీ అయినా, ప్రభుత్వం అయినా జగన్ తప్ప రెండవ తరం లీడర్ షిప్ లేదు. ఇప్పటిదాకా అంతా జగన్ పేరు మీదనే చలామణీ అవుతూ వచ్చింది. జనాలు కూడా ఆయన్ని చూసే ఓట్లేసి గెలిపించారు. కానీ సంస్థాగతంగా పార్టీని పటిష్టంగా జగన్ ఇంకా నిర్మించుకోలేదు. ఈ నేపధ్యమే ఇపుడు వైసీపీని భయపెడుతోంది. ఉద్యమాలు చేయడంలోనూ, ప్రత్యర్ధిని అష్ట దిగ్బంధనం చేయడంలోనూ కేసీఆర్ ని మించిన మొనగాడు లేడు. అలాంటి ఆయన‌కే దుబ్బాక కాజా తినిపించిన బీజేపీకి ఏపీలో జగన్ సులువుగా దొరికేస్తాడా అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.ఎవరు అవును అన్నా కాదన్నా కూడా కేసీఆర్ తో పోల్చితే జగన్ రాజకీయంగా బీజేపీ పట్ల మెతక వైఖరి అవలంబిస్తున్నారని చెప్పాలి. దానికి ఆయన మీద ఉన్న కేసులు కూడా కారణం అని ప్రత్యర్ధులు అంటారు. బీజేపీ ఈ సాకునే బాగా వాడేసుకుని ఏపీలో జగన్ ని ఏమీ కాకుండా చేస్తుందా అన్న కొత్త డౌట్లు పుట్టుకువస్తున్నాయి. ఇదిలా ఉంటే జగన్ కి అకస్మాత్తుగా పెరిగిన మోడీ ఇమేజ్, బీజేపీ సవాళ్ళు మరో వైపు కలవరపెట్టేలాగానే ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఏపీ పట్ల నిరాదరణ చూపిస్తున్న బీజేపీ ఇక మీదట తనదైన రాజకీయం కూడా మొదలుపెడితే జగన్ ఇబ్బందుల పాలు కావడం ఖాయమనే అంటున్నారు.ఇక జగన్ మీద దాడిని తిరుపతి ఉప ఎన్నికనే బీజేపీ సాధనంగా వాడుకుంటుంది అంటున్నారు. నిజానికి తిరుపతి ఉప ఎన్నిక కూడా సేమ్ దుబ్బాక మాదిరిగానే జరుగుతోంది. ఇక్కడ కూడా కరోనాతో సిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ మరణించారు. ఆయన కుటుంబానికే జగన్ ఉప ఎన్నికలో టికెట్ ఇస్తున్నారు. పైగా వైసీపీ అన్ని అసెంబ్లీ సీట్లలోనూ బలంగానే ఉంది. కానీ బీజేపీ రాజకీయం ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అన్నదే ఆసక్తికరమైన చర్చ. బీజేపీ తిరుపతిలో మత రాజకీయాల‌తో దూసుకువస్తుందా. లేక సర్కార్ వారి పాలన విఫలం అంటూ యాగీ చేస్తుందా అన్నది కూడా చూడాలి, ఇక్కడ బీజేపీకి ఏ మాత్రం అనుకూలం అనిపించినా టీడీపీ లోపాయికారి మద్దతు ఇచ్చినా ఇస్తుంది. అలాగే జనసేన తోడు, పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ తో తిరుపతి అగ్గి రాజుకుంటే జగన్ కి దుబ్బాక సీన్ కనిపిస్తుందా అన్నది హాట్ హాట్ చర్చగా ఉందిట.

Related Posts