YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

హైద్రాబాద్ బాద్ షా ఎవరో

హైద్రాబాద్ బాద్ షా ఎవరో

హైద్రాబాద్, నవంబర్ 19, 
వ‌రుస ఎన్ని క‌త‌లైనా ప‌డ‌నీ. కింగు కింగే. కానీ.. కింగుని బెండ్ చేసి.. కింగులా నుంచునే రాబోయే కింగు ఎవ‌రు అనేది పాయింట్. అంతే క‌దా మ‌రి. ఒక్క సీటుని వెయ్యోట్ల‌తో గెలిపించిన బండి సంజ‌య్ కే అంతుంటే.. తెలంగాణ మొత్తాన్ని నాదీ అనిపించుకున్న టీఆర్ఎస్ కి.. కేసీఆర్ కి ఎంతుండాలి చెప్పండి. అందుకే.. ఇప్పుడు టీఆర్ఎస్ కు పోటీ ఎవ‌రు అనేది హాట్ టాపిక్ అయింది. ఏదో డ‌బ్బాలో నాలుగు రాళ్లేసి అరిచిన‌ట్లు.. ఒక్క సీటుతో బీజేపీ ఏమో పెద్ద ఇది కాలేదు. అక్క‌డ కూడా జ‌స్ట్ ఓ వెయ్యోట్లొచ్చాయి అంతే. ఆ మాత్రం దానికే బీజేపీ ఎగిరెగిరి ప‌డితే.. ఏళ్ల పాటు తెలంగాణ‌ని ఏలిన కాంగ్రెస్ కి ఎంతుండాలి. ఇన్ని క‌ష్టాల్లో కూడా పార్టీని కాపాడుకుంటున్న కాంగ్రెస్ లీడ‌ర్ల‌ని ఏమ‌నాలి. ఇప్పుడంటే సెంట్ర‌ల్ లో బీజేపీ ఉంది కాబ‌ట్టి.. మొన్న దుబ్బాక‌లో గెలిచింది కాబ‌ట్టి.. బీజేపీ హీట్ ఉంది. కానీ.. కాంగ్రెస్ కూడా గట్టి పార్టీనే. హైదరాబాద్ లో కాంగ్రెస్ లీడ‌ర్లు కూడా త‌గ్గేదే లేదు అంటున్నారు. పైగా రేవంత్ రెడ్డి కాసుక్కూర్చున్నారు. రేవంత్ కి పార్టీ ప‌గ్గాలిస్తారు అనే టాక్ వ‌చ్చింది. పైగా ఎల‌క్ష‌న్లు త‌న అడ్డాలో జ‌రుగుతున్న‌య్. త‌న ఎంపీ నియోజ‌క‌వ‌ర్గంలో చాలా సీట్లు ఉన్న‌య్. సో.. రేవంత్ రెడ్డి కాంపిటీష‌న్ గ‌ట్టిగానే ఇస్తారు. అందుకే.. ఇప్పుడు కేసీఆర్ కి పోటీ బండి సంజ‌య్ నా.. లేదంటే రేవంత్ రెడ్డా అనేది హాట్ టాపిక్ అయింది. కానీ.. వేవ్స్ మాత్రం బండి సంజ‌య్ వైపే ఉన్న‌య్. టీఆర్ఎస్ కి బీజేపీతోనే కాంపిటీష‌న్ అంటున్నారు. కానీ.. చూడాలి. ఎవ‌రు నిల‌బ‌డ‌తారో.. ఎవ‌రు త‌డ‌బ‌డతారో ఎవ‌రికి తెలుసు చెప్పండి. ఏమో.. వీళ్లిద్ద‌రూ కాకుండా టీడీపీకి ఎక్కువ సీట్లొస్తాయేమో.. ఎవ‌రికి తెలుసు. మొన్న దుబ్బాక‌లో బీజేపీ గెలుస్తుంది అనుకున్నామా. లేదు క‌దా‌. ఏదో అంటారు క‌దా.. అద్భుతాలు జ‌రిగే వ‌ర‌కూ స‌మాజం గుర్తించ‌దు.. జ‌రిగిన త‌ర్వాత గుర్తించాల్సిన అవ‌స‌రం లేదు అని. చూద్దాం. ఇంకెన్నాళ్లు చెప్పండి. గ‌ట్టిగ ప‌దారు ప‌దేడు రోజులు అంతేగా.
రేస్ లో సీనీయర్ నేతల బిడ్డలు
అమ్మ ఎప్పుడూ అమ్మే. ఒక్క రోజు మాత్రం దేవ‌త అవుతుంది. అదే అమ్మ‌ల రోజు. సోష‌ల్ మీడియాలో అమ్మ‌ల‌తో ఫోటోలు దిగుతారు. రాఖీల రోజు.. చెల్లెల్లు అక్క‌లు గుర్తొస్తారు. పెళ్లి రోజు నాడు.. పెళ్లాం గుర్తొస్తుంది జ‌నాల‌కి.. వాళ్ల‌తో ఫోటోలు దిగి వాట్సాప్ స్టేట‌స్సుల్లో పెట్టుకుంటారు. కానీ.. ఈసారి గ్రేట‌ర్ ఎన్నిక‌ల్లో అమ్మ‌ల టైం వ‌చ్చింది.. కూతుళ్ల‌కి డిమాండ్ పెరిగింది.. పెళ్లాం చెబితే వింటాం అంటున్నారు లీడ‌ర్లు. అమ్మ వెన‌కాల ఉండేది కొడుకే.. కూతురి వెన‌కాల ఉండేది తండ్రే.. పెళ్లాం వెన‌క ఉండేది మొగుడే. కానీ.. ముందు మాత్రం వీళ్లుంటారు. ఎందుకు చెప్మా అంటే సింపుల్. ఎందుకేముంది చెప్పండి. మేయ‌ర్ ప‌దవి ఈసారి మ‌హిళ‌కే ద‌క్క‌బోతుంది. అది కూడా జ‌న‌ర‌ల్ మ‌హిళ‌కు.. సో.. అందరూ ఫైట్ లో ఉన్నారు. ప్ర‌తి వారూ.. త‌మ ఇంటి ఆడాళ్ల‌ని.. ఏమే ఒసే అని పిలిచే వాళ్ల‌ని కూడా మా మేడ‌మ్ అంటున్నారు. అమ్మ‌గారు నిల‌బ‌డుతున్నారు అంటున్నారు. అమ్మ‌గారికి సీటివ్వండి అంటున్నారు. మా భార్య‌గారికి ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. ఇక ఓట‌ర్ల‌ని కూడా అలాగే అడుక్కుంటారు. కౌన్సిల‌ర్ గా సీటొస్తే.. మెజార్టీ రాగానే.. మేయ‌ర్ ప‌ద‌వి వ‌చ్చేలా అప్పుడు చూస్కోవ‌చ్చు అనేది వాళ్ల లెక్క‌లు.ప్ర‌ధాన పార్టీల లీడ‌ర్లు మెయిన్ గా ఈ మేయ‌ర్ ప‌ద‌విపై ఫోక‌స్ చేశారు. కౌన్సిల‌ర్ గా గెలిస్తే చాలు.. మేయ‌ర్ అయిపోవ‌చ్చు అని లెక్క‌లేస్తున్నారు. జ‌స్ట్ ఒక ఏరియా కౌన్సిల‌ర్ అయితే.. సిటీకి బాస్ అయిపోవ‌చ్చు. జ‌స్ట్ ఇమాజిన్.. ఏ రేంజ్ ఉంటుందో. అందుకే.. సీనియ‌ర్ లీడ‌ర్లు కూడా ఫుల్లుగా ఫోక‌స్ చేస్తున్నారు.అన్ని పార్టీల్లోనూ ఇదే న‌డుస్తోంది. మంత్రి త‌ల‌సాని యాద‌వ్ కోడ‌లు, కేకే కుమార్తె.. మినిస్ట‌ర్ మ‌ల్లారెడ్డి కూతురు, ప‌ద్మారావు కోడ‌లు.. జ‌నార్ద‌న్ రెడ్డి కూతురు, బొంతు రామ్మోహ‌న్ భార్య‌, స‌బితా ఇంద్రారెడ్డి కోడ‌లు.. వీళ్లంతా కౌన్సిల‌ర్ టు మేయ‌ర్ ప్లాన్స్ లో ఉన్నారు. చూద్దాం. రాజ‌కీయ చ‌ట్రం ఎలా తిరుగుతుందో మ‌రి.

Related Posts