YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

105 సీట్లు.. 22 కులాలు..బిసిలకే ప్రాదాన్యం

105 సీట్లు.. 22 కులాలు..బిసిలకే ప్రాదాన్యం

హైదరాబాద్ నవంబర్ 19 
గ్రేటర్ ఎన్నిక మొత్తం స్థానిక అంశాలతో కూడుకున్న లోకల్ ఎలక్షన్ గానే చూడాల్సి ఉంటుంది. పార్టీ కంటే కూడా అభ్యర్థి చాలాచోట్ల కీ రోల్ ప్లే చేస్తుంటారు. గడిచిన ఐదేళ్లలో అలవాటైన కార్పొరేటర్.. ప్రజలకు అందుబాటులో ఉన్న వారిని వదిలేసి.. కొత్తవారిని ఎన్నుకోవాల్సిన అవసరం లేదు. మరోవైపు.. టీఆర్ఎస్ తో పోల్చినప్పుడు బీజేపీకి డివిజన్ల వారీగా బలమైన నాయకత్వం లేదు. ఓటర్లు ఉన్నప్పటికీ.. డివిజన్ ఫలితాన్ని ప్రభావితం చేసే స్థాయిలో వారికి బలం లేదు. ఇలాంటివేళ.. అభ్యర్థుల ఎంపిక మహా కష్టంగా మారుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. సామాజిక సమీకరణాలు సైతం కీలక భూమికపోషిస్తాయని చెబుతున్నారు.బుధవారం రాత్రి టీఆర్ఎస్ విడుదల చేసిన తొలిజాబితాను చూస్తే.. మొత్తం 105 స్థానాల్ని 22 సామాజిక వర్గాలకు కేటాయించటం గమనార్హం. అందులో అత్యధికం బీసీలకు ఇస్తే.. తర్వాతి స్థానం ఓసీలకు ఉంది. మైనార్టీలకు సైతం 16 స్థానాల్ని కేటాయించారు. బీసీల్లో బలమైన సామాజికవర్గాలుగా.. ఓటు బ్యాంకు ఉన్న గౌడ్.. యాదవ్.. మున్నూరుకాపులకు ఎక్కువ డివిజన్లు దక్కాయి. మొత్తం 105 స్థానా్లోల 54 స్థానాలు బీసీలకే దక్కాయంటే... దగ్గర దగ్గర యాభై శాతం సీట్లు వారికే సొంతమయ్యాయి.ఈ 54 స్థానాల్లోనూ గౌడ్లు.. యాదవ్.. మున్నూరు కాపులకు దగ్గరదగ్గర 36 స్థానాల వరకు ఉండటం గమనార్హం. అగ్ర వర్ణాల్లో రెడ్లకు అత్యధిక సీట్లు లభించాయి. వారికి 19 స్థానాలు లభించాయి. కమ్మ వారికి మూడు స్థానాలు లభిస్తే.. బ్రాహ్మిణులు.. వైశ్యులకు ఒక్కో స్థానాన్ని కేటాయించారు. మిగిలిన వారితో పోల్చినప్పుడు ఎస్సీ.. ఎస్టీలకు కేటాయించయిన స్థానాలు తక్కువనే మాట వినిపిస్తోంది.
కులాలవారీగా కేటాయించిన సీట్లు
 రెడ్డి – 19,మైనార్టీలు – 16,గౌడ్ – 15,మున్నూరుకాపు – 13,యాదవ – 8,కమ్మ – 3,ముదిరాజ్ – 3,గంగపుత్ర – 3,మాదిగ – 3,మాల – 3,లంబాడ – 3,నాయీబ్రాహ్మణ – 2,విశ్వబ్రాహ్మణ – 2,పద్మశాలి – 2,రజక – 2,లోధ – 2,బ్రాహ్మణ – 1,వైశ్య – 1,సగర – 1,లింగాయత్ – 1,మరాఠ - 1
కాపు - 1

Related Posts