YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

సమాచార శకంలో ముందుకు దూసుకెళ్తోన్న దేశం - ప్రధాని మోదీ

సమాచార శకంలో ముందుకు దూసుకెళ్తోన్న దేశం -  ప్రధాని మోదీ

బెంగళూరు నవంబర్ 19 
సమాచార శకంలో భారత దేశం ముందుకు దూసుకెళ్తోందని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం అన్నారు. బెంగళూరులో జరిగిన టెక్‌ సమ్మిట్‌-2020లో ప్రధాని ప్రారంభోపన్యాసం చేశారు. మూడు రోజుల జరిగే సమ్మిట్‌లో ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌, స్విస్‌ కాన్ఫెడరేషన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పార్మెలిన్‌, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్ పరిశ్రమను సరళీకృతం చేయడమే లక్ష్యంగా విధాన నిర్ణయాలు ఉన్నాయని మోడీ అన్నారు. సైబర్ దాడులు, వైరస్‌లకు వ్యతిరేకంగా సమర్థవంతంగా టీకాలు వేసే బలమైన సైబర్ సెక్యూరిటీ పరిష్కారాలను రూపొందించడానికి యువత కీలక పాత్ర పోషించాలని కూడా ఆయన కోరారు.కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌ మాట్లాడుతూ సమాచార రంగంలో కర్ణాటక ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. 1.3 బిలియన్ మంది ప్రజలు, 1.21 బిలియన్ మొబైల్ ఫోన్లు, 1.26 కోట్ల ఆధార్ కార్డులతో భారతదేశం అపారమైన డేటాను ఉత్పత్తి చేస్తుందని, ఈ డిజిటల్ ఎకోసిస్టమలన్నీ డేటాను ఉత్పత్తి చేస్తున్నాయి’ అని తెలిపారు. డేటా ఎకానమీలో ప్రధాన పాత్ర పోషించాలని కేంద్రమంత్రి నగరంలోని ఐటీ సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిస్‌ మాట్లాడుతూ డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పునాది సైబర్‌, ఎనేబుల్‌ టెక్నాలజీ అని, జూన్‌లో కుదుర్చుకున్న ఒప్పందం కింద భారత్‌తో కలిసి పని చేస్తామన్నారు.

Related Posts