ఇస్లామాబాద్ నవంబర్ 19
2008, సెప్టెంబర్ 11న ముంబైలో జరిగిన దాడుల సూత్రధారి, పాకిస్థాన్ ఉగ్రవాది హఫజీ సయిద్‌కు పదేళ్ల జైలు శిక్ష పడింది. రెండు ఉగ్రవాద కేసుల్లో అతనికి ఈ శిక్షను పాకిస్థాన్ కోర్టు ఇవాళ ఖరారు చేసింది. జమాత్ ఉల్ దవా చీఫ్‌కు పాక్ కోర్టు శిక్షను ఖరారు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా వ్యవస్థాపకుడైన హఫీజ్‌కు గత ఫిబ్రవరిలో కూడా పాక్ కోర్టు శిక్షను వేసింది. ఓ టెర్రర్ ఫండింగ్ కేసులో అతనికి 11 ఏళ్ల శిక్షను వేశారు. హఫీజ్‌ను గ్లోబల్ ఉగ్రవాదిగా అమెరికాతో పాటు యూఎన్ గుర్తించాయి. గత ఏడాది జూలైలో అంతర్జాతీయ వత్తిళ్ల కారణంగా.. టెర్రర్ ఫండింగ్ కేసులో పాక్ అతన్ని అరెస్టు చేసింది.