YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

విస్తరణ కోసం ఎదురుచూపులు

విస్తరణ కోసం ఎదురుచూపులు

బెంగళూర్, నవంబర్ 20, 
కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ను అధిష్టానం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆయన గత కొంతకాలంగా మంత్రి వర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు. అధిష్టానం అనుమతి కోసం వేచి చూస్తున్నా కేంద్ర నాయకత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా ఆయన ఢిల్లీకి హడావిడిగా వెళితే మంత్రివర్గ విస్తరణ ఉంటుందనుకున్నారు. కానీ అక్కడ ఎవరితో మాట్లాడకుండానే ఉత్త చేతులతో యడ్యూరప్ప వెనక్కు తిరిగి రావడం పార్టీలో చర్చనీయాంశమైంది.చాలా రోజుల నుంచి యడ్యూరప్ప మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలనుకుంటున్నారు. మరో ఆరుగురికి మాత్రమే మంత్రివర్గంలో అవకాశముంది. అయితే యడ్యూరప్ప మాత్రం మంత్రివర్గాన్ని ప్రక్షాళన చేయాలనుకుంటున్నారు. కొందరిని తొలగించి మరికొందరికి అవకాశమివ్వాలని భావిస్తున్నారు. దాదాపు ఎనిమిది నెలలుగా యడ్యూరప్ప మంత్రివర్గ విస్తరణ చేపట్టాలనుకుంటున్నా అధిష్టానం మాత్రం అందుకు అవకాశమివ్వడం లేదు.మధ్యలో బీహార్ ఎన్నికలతో పాటు ఉప ఎన్నికలు కూడా రావడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. తాజాగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకు యడ్యూరప్ప ఢిల్లీ వెళ్లినా అక్కడ ఆయనతో మాత్రమే భేటీ అయ్యారు. అమిత్ షాతో సమావేశం కుదరలేదు. దీంతో మంత్రివర్గ విస్తరణపై యడ్యూరప్ప కు క్లారిటీ రాలేదు. మంత్రివర్గ విస్తరణ కోసం అనేక మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు.మంత్రి వర్గ విస్తరణకు అధిష్టానం అనుమతించకపోవడానికి అనేక కారణాలున్నాయంటున్నారు. ఇందుకు పార్టీలో తలెత్తిన అసంతృప్తి అని చెప్పక తప్పదు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి విస్తరణలో అవకాశం కల్పించాలని యడ్యూరప్ప భావిస్తుండటంతో అసంతృప్త నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి చోటు కల్పంచకపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. యడ్యూరప్ప పనితీరుపై కూడా ఎప్పటికప్పుడు కేంద్ర నాయకత్వానికి ఇక్కడి నుంచి నివేదికలు వెళుతున్నాయి. అందుకే యడ్యూరప్పను కేంద్ర నాయకత్వం లైట్ గా తీసుకుంటుందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Related Posts