YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ..కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే సత్యప్రభ..కన్నుమూత

తిరుపతి,నవంబర్ 20,
కరోనా మహమ్మారి ఎంతో మంది కబళించి వేసింది. పలువురు రాజకీయ నేతలు కూడా కరోనా బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీఏ సత్యప్రభ కూడా కరోనా కారణంగా కన్నుమూశారు. కరోనా వైరస్ బారినపడిన సత్యప్రభ గత నెల 10వ తేదీ నుంచి బెంగళూరులోని వైదేహీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పటి నుంచి ఆమెను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ నెల 3న ఆమె పరిస్థితి మరింత క్షీణించడంతో వెంటిలేటర్‌పైకి చేర్చారు. గత రాత్రి పరిస్థితి మరింత దిగజారడంతో తుదిశ్వాస విడిచారు. వైదేహి ఆసుపత్రి ఆమె సొంత ఆసుపత్రి. ఆమె వయసు 70 సంవత్సరాలు. చిత్తూరు జిల్లా సదుం మండలానికి చెందిన వారు సత్యప్రభ. ఆమె భర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన డీకే ఆదికేశవులు నాయుడు చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతగా ఎదిగారు. టీడీపీలో చేరిన ఆయన 2004లో చిత్తూరు నుంచి ఎంపీగా గెలిచారు. రెండుసార్లు టీటీడీ చైర్మన్‌గా పనిచేశారు. 2013లో అనారోగ్యంతో ఆయన మృతి చెందిన తర్వాత సత్యప్రభ రాజకీయాల్లోకి వచ్చారు. 2014లో టీడీపీ నుంచి చిత్తూరు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సత్య ప్రభ చనిపోయారని తెలియడంతో చిత్తూరు జిల్లా టీడీపీలో విషాదఛాయలు అలముకున్నాయి.

Related Posts