YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గ్రేటర్ గుర్తులు ఖరారు

గ్రేటర్ గుర్తులు ఖరారు

హైద్రాబాద్, నవంబర్ 20, 
 గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో పోటీ చేసే రిజిస్టర్డ్‌ పార్టీలతోపాటు ఇండిపెండెంట్‌ క్యాండిడేట్లకు 50 ఫ్రీ సింబల్స్‌ అందుబాటులో ఉన్నాయని స్టేట్‌ ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. నాలుగు జాతీయ పార్టీలు, నాలుగు ప్రాంతీయ పార్టీలతోపాటు ఇతర రాష్ట్రాల్లోనూ గుర్తింపు పొందిన పార్టీలు మూడు ఉన్నాయని, ఆ పార్టీల కామన్‌ సింబల్స్‌ను సంబంధిత పార్టీ బీఫాం జత చేసే క్యాండిడేట్లకు కేటాయిస్తామని తెలిపారు. ఇవికాకుండా ఎస్‌ఈసీ వద్ద 45 పార్టీలు రిజిస్టర్ అయ్యాయన్నారు. వాటిలో కొన్ని పార్టీలకు గతంలో కామన్‌ సింబల్‌ కేటాయించి, పది శాతం అభ్యర్థులను పోటీలో నిలుపలేకపోవడంతో తొలగించామని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఇప్పటి వరకు కామన్‌ సింబల్‌ పొందని పార్టీలు గురువారం నాటికి రూ.10 వేల డీడీతో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. రిజిస్టర్డ్‌ పార్టీలకు కేటాయించిన సింబల్స్‌ పోను మిగిలిన ఫ్రీ సింబల్స్‌ను ఇండిపెండెంట్స్కు  కేటాయిస్తామన్నారు.ఎయిర్‌ కండీషనర్, ఆపిల్‌, గాజులు, బ్యాట్‌, బ్యాటరీ టార్చ్‌, బైనాక్యులర్స్‌, బాటిల్‌ (సీసా), బకెట్‌, క్యారంబోర్డు, చెయిన్‌, కోట్‌, కొబ్బరితోట, మంచం, కప్పుసాసర్‌, కటింగ్‌ ప్లేయర్‌, విద్యుత్‌ స్తంభం, ఎన్వలప్‌ (కవర్‌), పిల్లనగ్రోవి, ఫుట్‌బాల్‌, గౌన్‌, గరాటా, గ్యాస్‌ సిలెండర్‌, గాజు గ్లాస్‌, ద్రాక్షపండ్లు, హెడ్‌ ఫోన్‌, హాకీ స్టిక్‌ – బాల్‌, బెండకాయ, పోస్టుబాక్స్‌, మూకుడు, ప్యాంట్‌, పెన్‌డ్రైవ్‌, పైనాపిల్‌, కుండ, ప్రెషర్‌ కుక్కర్‌, ఉంగరం, రోబోట్‌, రంపం, కత్తెర, షటిల్‌కాక్‌, సితార్‌, సాక్స్‌, స్పానర్‌, స్టెతస్కోప్‌, స్టూల్‌, టేబుల్‌, టూత్‌బ్రష్‌, ట్రంపెట్‌, టైర్స్‌, విజిల్‌.

Related Posts